హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Crashed Planes: రెండు చోట్ల విమాన ప్రమాదాలు.. తునాతునకలైన శకలాలు

Crashed Planes: రెండు చోట్ల విమాన ప్రమాదాలు.. తునాతునకలైన శకలాలు

plane crash(Photo:Twitter)

plane crash(Photo:Twitter)

Crashed planes:మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30, మిరాజ్ 2000 అనే రెండు విమానాలు కూలిపోయాయి. ఘటన స్తలంలో విమానశకలాలు తునాతునకలైపోయినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లో కూడా ఓ చార్టెడ్ ఫ్లైట్ కూలింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Madhya Pradesh, India

మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30, మిరాజ్ 2000 అనే రెండు విమానాలు కూలిపోయాయి. ఘటన స్తలంలో విమానశకలాలు తునాతునకలైపోయినట్లుగా గుర్తించారు.పైలట్లు సకాలంలో బయటపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లుగా పోలీసు సూపరింటెండెంట్ అశుతోష్ బగ్రీ తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Video Viral| Ranbir kapoor: అభిమాని సెల్ఫీ అడిగితే బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌కపూర్‌కి అంత కోపమా .. ఏం చేశాడో వీడియో చూడండి

కుప్పకూలిన విమానాలు..

ప్రమాదానికి గురైన రెండు విమానాలు రక్షణ వర్గాలకు చెందిన విమానాలేనని తెలుస్తోంది.అయితే ఈ విమాన ప్రమాదానికి కారణం ఏమిటి...ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

వరుసగా రెండు ఘటనలు..

ఈసంఘటనకు కొద్ది నిమిషాల ముందు రాజస్థాన్‌లో కూడా ఓ చార్టర్డ్ విమానం కూలింది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని నాగ్లా దిడాలో ఫైటర్ విమానం కూలిపోయింది. ఘటనా స్థలానికి పోలీసులను, అధికార యంత్రాంగాన్ని పంపించినట్లు జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ తెలిపారు. ప్రమాదం చాలా తీవ్రంగా ఉందని, పైలట్ గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదని ఒక అధికారి తెలిపారు. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.

ప్రమాద దృశ్యాలు..

ఈవార్తలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ న్యూస్ మీకు న్యూస్‌18 తెలుగు అందిస్తుంది.

First published:

Tags: Madhya pradesh, Rajasthan

ఉత్తమ కథలు