Home /News /national /

TWITTER WITHDRAWS BLUE VERIFIED BADGE FROM PERSONAL TWITTER HANDLE OF VICE PRESIDENT OF INDIA M VENKAIAH NAIDU SAYS OFFICE OF VICE PRESIDENT NK

Twitter: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి షాక్... అంతపని చేసిన ట్విట్టర్

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ అకౌంట్

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ అకౌంట్

Twitter: ఈ మధ్య కేంద్ర ప్రభుత్వంతో వాదనకు దిగుతున్న ట్విట్టర్... తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పుడు ఢిల్లీ సర్కిల్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది.

    Twitter: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్... శనివారం... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ అకౌంట్ నుంచి అధికారిక బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యూడ్జ్‌ను తొలగించింది. ఐతే... ప్రస్తుతం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉండటంతో... ఆయన కార్యాలయం సెక్రటేరియట్ నిర్వహిస్తున్న... VPసెక్రటేరియట్ (వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా) మాత్రం బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌తో కొనసాగుతోంది. "ట్విట్టర్... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధికారిక అకౌంట్ నుంచి బ్లూ వెరిఫైడ్ బ్యా్డ్జ్‌ని తొలగించింది." అని ANI న్యూస్ ఏజెన్సీకి... ఉపరాష్ట్రపతి కార్యాలయం స్వయంగా తెలిపింది.

    ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ అకౌంట్


    ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారిక అకౌంట్ నుంచి... చివరిసారిగా గతేడాది జులై 23న ఓ ట్వీట్ వచ్చింది. ఆయన అకౌంట్‌కి 13 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. అదే సయంలో... ఉపరాష్ట్రపతి కార్యాలయ అధికారిక అకౌంట్‌కి 9,31,000 ఫాలోయర్స్ ఉన్నారు.


    కొత్త ఐటీ రూల్స్‌కి సంబంధించి... గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు కేంద్రంతో డీల్ ఓకే చేసుకోగా... ట్విట్టర్ మాత్రం ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి అంగీకరించలేదు. కేంద్రంతో వాదనకు దిగుతోంది. ఇలాంటి సమయంలో... ఈ సంచలన డెవలప్‌మెంట్ వచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో త్వరలో తెలుస్తుంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Twitter, Venkaiah Naidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు