Mastodon: మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్(Twitter)ను టెస్లా అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) సొంతం చేసుకున్న తరువాత అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగులను తొలగించడం మొదలు, బ్లూ టిక్‌మార్క్ సబ్‌స్క్రిప్షన్ వరకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. త్వరలోనే ట్వీట్ వర్డ్ లిమిట్‌ను భారీగా పెంచుతున్నట్లు సమాచారం. దీంతో ఈ చర్యలు రుచించని చాలా మంది ట్విట్టర్ యూజర్లు ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫామ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ట్విట్టర్ పోటీదారు.. డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మాస్టోడాన్‌కు ఇటీవల కాలంలో సబ్ స్క్రైబర్స్ సంఖ్య రెండు మిలియన్లకు పైగా పెరిగింది.
అక్టోబర్- నవంబర్‌లో పెరుగుదల
అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యకాలంలో వివిధ ఆర్గనైజేషన్స్‌తో పాటు జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు, రచయితలు, నటులు మాస్టోడాన్ ను ఎక్కువగా సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. దీంతో 300Kగా ఉన్న నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య, ఇప్పుడు 2.5 మిలియన్లకు చేరింది. ఈ విషయాన్ని మాస్టోడాన్ గత సోమవారం ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది.
ట్విట్టర్‌లో బంద్
డిసెంబరు 16న ట్విట్టర్‌లో మాస్టోడాన్@joinmastodon ఖాతాను సస్పెండ్ చేశారు. దీంతో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌కు ఓ రిపోర్ట్ వచ్చింది. @ElonJet ఖాతాతో పూర్తిగా సంబంధం లేని వాటితో సహా ఏ మాస్టోడాన్ సర్వర్‌లకు సంబంధించిన లింక్‌లను యూజర్లు ట్వీట్ చేయలేకపోయారనే రిపోర్ట్‌లో తేలింది.
అదిరిపోయే టిప్స్ లిస్ట్ విడుదల చేసిన గూగుల్ .. వీటితో మీ పనులు ఇక సులభం
మధ్యవర్తి అవసరం లేదు
దీంతో మాస్టోడాన్ ఇలా స్పందించింది.. ‘మాస్టోడాన్‌లో మీకు, మీ ప్రేక్షకులకు మధ్య మధ్యవర్తి ఉండాల్సిన అవసరం లేదు. జర్నలిస్టులు, ప్రభుత్వ సంస్థలు ప్రజలకు చేరుకోవడానికి ప్రత్యేకంగా ప్రైవేట్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని మేం నమ్ముతున్నాం.’ అని ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ పేర్కొంది.
ఫ్రీ- ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్
గ్లోబల్ డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా నెట్‌వర్క్ మాస్టోడాన్‌కు కనెక్ట్ కావాలనుకుంటే ఫ్రీ- ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఎవరైనా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వారు అనుకున్నట్లుగా రన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది వారి అధీనంలో ఉంచుకోవచ్చని ఈ సంస్థ ప్రకటించింది.
రెండింటి మధ్య పోలికలు
మాస్టోడాన్ చాలా అంశాల్లో ట్విట్టర్‌ను పోలి ఉంటుంది. దీని యూజర్లు పోస్ట్‌లను రావయవచ్చు. దీన్ని టూట్స్ అని పిలుస్తారు. ఇతరుల టూట్స్‌కు రిప్లై, లైక్, రీపోస్ట్ చేయవచ్చు. అలాగే ఒకరినొకరు ఫాలో అవ్వవచ్చు. అయితే ఇది ఓపెన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్. ఇది విభిన్నమైనది. స్వతంత్రంగా నడిచే సంస్థ. దీని సర్వర్స్ వేర్వేరు నియమాలను కలిగి ఉంటాయి. కొన్నిసార్లు Twitterలో ఉన్న వాటి కంటే కఠినంగా ఉంటాయి. ఒక సర్వర్‌లో ద్వేషపూరిత ప్రసంగం ఉంటే, ఇతర సర్వర్లు ఉమ్మడిగా ఆ సర్వర్‌ని బ్లాక్ చేస్తాయి. ఇది ఉచిత ప్లాట్‌ఫారమ్. దీంతో వ్యక్తులు తమ వ్యాపారాలు ప్రచారం చేసుకోవచ్చు. మాస్టోడాన్‌లో ప్రకటనలు ఉండవు. అయితే, కొన్ని సర్వర్లు విరాళాలు అడగవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Social Media, Twitter