Home /News /national /

TWITTER RESTORES BLUE VERIFIED BADGE TO PERSONAL TWITTER HANDLE OF VICE PRESIDENT OF INDIA M VENKAIAH NAIDU NK

Twitter: వెనక్కి తగ్గిన ట్విట్టర్... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి మళ్లీ బ్లూ బ్యాడ్జ్

Twitter: వెనక్కి తగ్గిన ట్విట్టర్... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి మళ్లీ బ్లూ బ్యాడ్జ్ (image credit - twitter)

Twitter: వెనక్కి తగ్గిన ట్విట్టర్... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి మళ్లీ బ్లూ బ్యాడ్జ్ (image credit - twitter)

Twitter: ట్విట్టర్ వెంటవెంటనే సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉదయం చేసిన పనికి తప్పైపోయిందని గ్రహించిన ట్విట్టర్... దాన్ని సరిచేసుకుంటూ... మళ్లీ రూట్ మార్చుకుంది. అసలేమైందో తెలుసుకుందాం.

    Twitter: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్సనల్ అకౌంట్‌కి మళ్లీ బ్లూ బ్యాడ్జ్ వేసేసింది ట్విట్టర్. అయితే... వివాదం సద్దుమణిగిపోతుందని మాత్రం అనుకోలేం. అసలేమైందంటే... ఈ ఉదయం వెంకయ్యనాయుడు పర్సనల్ అకౌంట్‌కి ఉన్న బ్లూ బ్యాడ్జిని తొలగించింది ట్విట్టర్. ఈ బ్యాడ్జి ఉంటేనే... అది నిజమైన అకౌంట్ అని నెటిజన్లు గ్రహించగలరు. బ్యాడ్జ్ లేని అకౌంట్ నిజమైనదో, నకిలీదో గుర్తించడం కష్టం. అందువల్ల బ్యాడ్జ్ తొలగించడంపై పెద్ద దుమారం రేగింది. ట్వట్టర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని గమనించిన ఉపరాష్ట్రపతి కార్యాలయం... ఎందుకు తొలగించారని ట్విట్టర్ యాజమాన్యాన్ని వివరణ కోరింది. దాదాపు ఏడాది కాలంగా... ఆ ఎకౌంట్ యాక్టివ్‌గా లేదనీ... అందువల్లే బ్యాడ్జి తొలగించామని ట్విట్టర్ చెప్పింది. ఐతే... వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక... తన సమాచారం అంతా... అధికారిక ఉపరాష్ట్రపతి కార్యాలయ అకౌంట్ నుంచి పంపుతున్నారనీ... అంత మాత్రాన... యాక్టివ్‌గా లేనట్లు కాదని... చెప్పడంతో... ట్విట్టర్... తన తప్పును సరిచేసుకుంది. మళ్లీ బ్లూ బ్యాడ్జ్ వేసేసింది.



    Vice President of India M Venkaiah Naidu, RSS leaders, Twitter withdraws, blue verified badge, Office of Vice President, twitter centre face off, new it rules, why twitter do, breaking news, telugu news, తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్,
    Twitter: వెనక్కి తగ్గిన ట్విట్టర్... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి మళ్లీ బ్లూ బ్యాడ్జ్ (image credit - twitter)


    ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారిక అకౌంట్ నుంచి... చివరిసారిగా గతేడాది జులై 23న ఓ ట్వీట్ వచ్చింది. ఆయన అకౌంట్‌కి 13 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. అదే సమయంలో... ఉపరాష్ట్రపతి కార్యాలయ అధికారిక అకౌంట్‌కి 9,31,000 ఫాలోయర్స్ ఉన్నారు.


    వెంకయ్యనాయుడు పర్సనల్ అకౌంట్‌కి వెరిఫైడ్ బ్లూ బ్యాడ్జిని తొలగించడం ద్వారా... పెను దుమారానికి తెరతీసిన ట్విట్టర్... ఆ తర్వాత... RSS నాయకుల అకౌంట్లను అన్-వెరిఫైడ్ చేసింది. వాటికి ఉండే అధికారిక బ్లూ కలర్ బ్యాడ్జిని తొలగించింది. RSS నేతలైన... అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ అరుణ్ కుమార్ అకౌంట్‌కి బ్యాడ్జిని తొలగించింది. అలాగే... RSS సా సార్ కార్యవాహక్ అయిన సురేష్ సోని అకౌంట్‌కి కూడా బ్యాడ్జిని తొలగించింది.

    Vice President of India M Venkaiah Naidu, RSS leaders, Twitter withdraws, blue verified badge, Office of Vice President, twitter centre face off, new it rules, why twitter do, breaking news, telugu news, తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్,
    మొదట వెంకయ్యనాయుడు... ఇప్పుడు RSS నేతలు... ట్విట్టర్ ఎందుకిలా చేస్తోంది? (image credit - twitter)




    ఇది కూడా చదవండి: World Environment Day: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. కొన్ని షాకింగ్ నిజాలు

    మరోవైపు... నైజీరియా అధ్యక్షుడు బుహారీ ట్వీట్‌ని ట్విట్టర్ తొలగించడంతో... ఆ దేశం ఏకంగా ట్విట్టర్‌ను బ్యాన్ చేసింది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Twitter, Venkaiah Naidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు