Home /News /national /

TWITTER INDIA HEAD MANISH MAHESHWARI MOVES TO US BASED ROLE SU

Manish Maheshwari: ట్విట్టర్ సంచలన నిర్ణయం.. ట్విట్టర్ ఇండియా హెడ్‌‌ మనీష్ మహేశ్వరి బదిలీ

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ భారత్‌లో కొద్ది రోజులుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ నిబంధనల అమలుకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వంతో ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం కొనసాగుతుంది.

    సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ భారత్‌లో కొద్ది రోజులుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ నిబంధనల అమలుకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వంతో ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం కొనసాగుతుంది. మరోవైపు రాహుల్‌ గాంధీతోపాటుగా పలువురు ప్రతిపక్ష నేతల ట్విట్టర్ అకౌంట్ల నిలిపివేతపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్విటర్‌ ఇండియా చీఫ్‌గా వ్యవహరిస్తోన్న మనీశ్‌ మహేశ్వరిని బదిలీ చేసింది. ఆయనకు అమెరికా కేంద్రంగా కొత్త బాధ్యతలను అప్పగించినట్టు ట్విట్టర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది.

    ‘గత రెండేళ్లకుపైగా మా భారతీయ వ్యాపారానికి నాయకత్వం వహించినందుకు మనీష్ మహేశ్వరికి ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా నూతన మార్కెట్ల కోసం అమెరికా కేంద్రంగా రెవిన్యూ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ ఇన్‌ఛార్జిగా మీరు కొత్త పాత్ర పోషించబోతున్నందుకు అభినందనలు. ట్విటర్‌ సంబంధించి మీరు ముఖ్యమైన బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది’ అని ట్విటర్‌కు దక్షిణ కొరియా, జపాన్‌, ఆసియా పసిఫిక్‌ విభాగం ఉపాధ్యక్షుడిగా ఉన్న యూ-సన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.





    ఇక, భారత ఐటీ చట్టాలను పాటించకపోవడంపై కొద్ది రోజులుగా ట్విటర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. అంతేకాకుండా ట్విట్టర్‌లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఓ వీడియోకు సంబంధించి ఉత్తప్రదేశ్‌లోని ఘజియాబాద్ పోలీసులు ట్విట్టర్ ఎండీకి కూడా పంపారు. అయితే ఇందుకు సంబంధించి.. ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఊరట లభించింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: New IT act, Twitter

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు