Rahul Gandhi: రాహుల్ గాంధీకి షాక్.. ఖాతాను సస్పెండ్‌ చేసిన ట్విటర్.. ఆ ట్వీటే కారణమా?

రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీ ట్వీట్‌పై జాతీయ పౌర హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫొటోను సోషల్ మీడియాలలో పోస్ట్ చేసినందుకు గాను ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.

  • Share this:
    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ట్విటర్ షాకిచ్చింది. ఆయన ట్విటర్ ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఐతే కొద్ది సేపు మాత్రమే సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కాసేపటికే మళ్లీ పునరుద్ధరించింది. రాహుల్ గాంధీ ఖాతాను సస్పెండ్ చేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. దాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని.. ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా రాహుల్ గాంధీ తన గళాన్ని వినిపిస్తారని తెలిపింది. ఆ తర్వాత కాసేపటికే ఆయన ఖాతా రీయాక్టివేట్ అయింది. ఢిల్లీలో దుండగుల లైంగిక దాడిలో మరణించిన 9 ఏళ్ల దళిత బాలిక కుటుంబాన్ని రాహుల్ గాంధీ బుధవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ ట్వీట్‌పై దుమాంర రేగింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని ఖాతాను కాసేపు నిలిపివేశారు.


    బుధవారం ఢిల్లీలో మృతురాలి కుటుంబ సభ్యును కలిసిన రాహుల్ గాంధీ.. ఆమె ఇక లేదు అని ట్వీటర్ చేశారు. బాలికకు న్యాయం జరగాలని ఆమె తల్లిదండ్రుల కన్నీళ్లు డిమాండ్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పోరాటంలో తాను వారికి అండగా ఉంటానని తెలిపారు. ఐతే ఈ వ్యవహారంపై జాతీయ పౌర హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫొటోను సోషల్ మీడియాలలో పోస్ట్ చేసినందుకు గాను ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. జువైన్ జస్టిస్ యాక్ట్‌తో పోక్సో చట్టాలను ఆయన ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనర్లు అత్యాచారానికి గురైన కేసుల్లో వారి ఫొటోలు గానీ, కుటుంబ సభ్యుల వివరాలను కానీ బహిర్గతం చేయకూడదని.. అందుకే ఆయనపై కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది.

    రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై దుమారం రేగడంతో ట్విటర్ కూడా స్పందించింది. ఆ ట్వీట్‌పై క్లిక్ చేస్తే.. ఇది ట్విటర్ రూల్స్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని సందేశం కనిపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విటర్‌ ఖాతాను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ కూడా కనిపించడం లేదు.

    ఇది కూడా చదవండి:

    Bluetooth blast : బ్లూ టూత్ హెడ్‌ఫోన్ బ్లాస్ట్... యువకుడు మృతి..

    దోమలతో చచ్చిపోతున్నాం.. కాపాడండి మహాప్రభో.. రోడ్డెక్కి ప్రజల ఆందోళన..
    Published by:Shiva Kumar Addula
    First published: