Home /News /national /

TWITTER ACCOUNT OF INDIAN COUNCIL OF WORLD AFFAIRS HACKED RENAME AS ELON MUSK NOW RESTORED MKS

ICWA : మొన్న ప్రధాని మోదీ.. నేడు కేంద్ర సంస్థ ట్విటర్ అకౌంట్ హ్యాక్.. Elon Musk పేరుతో..

ఐసీడబ్ల్యూఏ ట్విటర్ ఖాతా హ్యాక్

ఐసీడబ్ల్యూఏ ట్విటర్ ఖాతా హ్యాక్

ప్రపంచ దేశాలతో దౌత్యానికి సంబంధించి కీలకమైనదిగా భావించే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ఐసీడబ్ల్యూఏ) ట్విటర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. రెండు వారాల కిందట భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాక్ చేసిన దుండగులే ఇప్పుడు కేంద్ర సంస్థ అకౌంట్ పై దాడి చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

ఇంకా చదవండి ...
దేశంలో పరిపాలన విధివిధానాలు, పాలసీల రూపకల్పనలో కీలకంగా పనిచేసే నీతి ఆయోగ్ సంస్థలాగే, భారత విదేశీ వ్యవహారాలకు సంబంధించి ప్రధాన థింక్ ట్యాంక్ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ఐసీడబ్ల్యూఏ) సంస్థ అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఐసీడబ్ల్యూఏ ట్విటర్ ను హ్యాక్ చేసిన దుండగులు.. ఆ అకౌంట్ కు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ పేరు పెట్టారు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై అధికారుల ఫిర్యాదుతో ట్విటర్ సంస్థ వేగంగా స్పందించింది. రెండు వారాల కిందట భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాకింగ్ కు గురైన తర్వాత మళ్లీ కేంద్ర సంస్థ అకౌంట్ పై దాడి జరగడం ఇదే తొలిసారి.

డిసెంబర్ 12న ప్రధాని మోదీ ట్విటర్ అకౌంట్ కాసేపు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రధాని ట్విటర్ ను అదుపులోకి తీసుకున్న హ్యాకర్లు.. భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీకి అనుమతి ఇచ్చిందంటూ ప్రకటన చేయడంతో కలకలం రేగింది. కాగా, ప్రధాని కార్యాలయం(పీఎంవో) సకాలంలో స్పందించి హ్యాకర్లు చేసిన ప్రకటన నకిలీదిగా వివరణ ఇచ్చింది. అయితే, ఆదివారం రాత్రి హ్యాకైన ఐసీడబ్ల్యూఏ ట్విటర్ అకౌంట్ లోనూ దుండగులు క్రిప్టోకరెన్సీ అనుకూల ప్రకటనలు చేయడం గమనార్హం.

shocking : కుప్పకూలిన పార్లమెంట్ పైకప్పు.. చారిత్రక భవంతి దగ్ధం.. మంటగలిసిన దేశం పరువు


1943లో ఏర్పాటైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ఐసీడబ్ల్యూఏ) తొలుత ఎన్జీవోగా మొదలై కాల క్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ పరిధిలోకి వచ్చింది. ఈ సంస్థకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చైర్మన్ గానూ, విదేశాంగ మంత్రి జైశంకర్ ఉప చైర్మన్ గానూ వ్యవహరిస్తారు. ఐసీడబ్ల్యూఏ ట్విటర్ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు అకౌంట్ కు టెస్లా సంస్థ చీఫ్ ఎలాన్ మస్క్ పేరు పెట్టారు. క్రిప్టో కరెన్సీకి మద్దతుగా రెండు ట్వీట్లు వదిలారు.

Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్.. బీజేపీ ఆఫీసు బద్దలుకొట్టి.. స్టేషన్‌లోనే దీక్ష..



దేశంలో క్రిప్టో కరెన్సీ కార్యకలాపాలు తారా స్థాయికి చేయడం, కేంద్రం, ఆర్బీఐ అనుమతి లేకుండానే రోజుకు వేల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతుండటం, అందులోనూ పెద్ద ఎత్తున మోసాలు బయటపడుతోన్న నేపథ్యంలో భారత్ లో బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీల వాడకానికి సంబంధించి కేంద్రం హెచ్చరికలు చేసింది. దేశంలో క్రిప్టో కరెన్సీకి అనుమతివ్వబోమని, అదే సమయంలో దానిని రెగ్యులరైజ్ చేసే చట్టాన్ని రూపొందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధాని మోదీ, ఇప్పుడు ఐసీడబ్ల్యూఏ ట్విటర్ అకౌంట్లను హ్యాక్ చేసింది ఒకరేనా లేక వేర్వేరు వ్యక్తులా అనేది తెలియాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Hacking, Twitter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు