TRUCK WITH 2 4 LAKH COVID 19 VACCINE DOSES FOUND ABANDONED FOR 12 HOURS IN MADHYA PRADESH SU
Covid-19 Vaccine: రోడ్డు పక్కన 2.4 లక్షల కరోనా టీకాలు.. తీవ్ర కలకలం.. ఎక్కడంటే..
ప్రతీకాత్మక చిత్రం
రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్‌ల్లో దాదాపు 2.4 లక్షల కరోనా వ్యాక్సిన్ ఉండటం తీవ్ర కలకలం రేపింది. 12 గంటలుగా ఆ వాహనం అక్కడే నిలిపిఉండటంతో స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే పలు చోట్ల వ్యాక్సిన్ల కొరత ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోడ్డుపక్కన నిలిపి ఉంచి వాహనంలో భారీగా కోవిడ్ వ్యాక్సిన్లు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రోడ్డుపక్కన నిలిపిన ట్రక్కులో దాదాపు 2.4 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు ఉన్నాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. నర్సింగ్‌పూర్ జిల్లాలోని కరేలి బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన ఓ ట్రక్కు నిలిపి ఉంది. అయితే 12 గంటలకు పైగా ట్రక్ అక్కడే నిలిపి ఉంది. ట్రక్ డ్రైవర్గానీ, అందుకు సంబంధించి ఎవరూ కూడా కనిపించలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
తమకు అందించిన సమాచారంతో కరేలీ పోలీసులు ట్రక్ నిలిపి ఉన్న చోటుకు చేరుకున్నారు. ఆ ట్రక్‌లో భారత్ బయోటెక్ సంస్థకు చెందిన 2.4 లక్షల కోవాగ్జిన్ డోసులు ఉన్నట్టు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ల విలువ దాదాపు 8 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
కరేలీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ అశిష్ బోపాచే మాట్లాడుతూ.. ‘రోడ్డు పక్కన నిలిపిన ట్రక్‌లో 2.4 లక్షల వ్యాక్సిన్ డోసులు ఉన్నట్టు గుర్తించాం. . ట్రక్కు మీదున్న నంబరుతో డ్రైవర్ మొబైల్ లోకేషన్‌ను ట్రేస్ చేయగా.. హైవే సమీపంలోని చెట్ల పొదల్లో ఉన్నట్లుగా చూపెట్టింది. ట్రక్కులోని ఎయిర్ కండిషన్ పనిచేస్తుండటంతో.. డోసులు సురక్షితంగానే ఉన్నాయి. డ్రైవర్, క్లీనర్ కన్పించలేదు.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాం. వారి జాడ తెలియాల్సి ఉంది’అని తెలిపారు.
భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,01,993 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,64,969కి చేరింది. కొత్తగా 3,523 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,11,853కి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 32,68,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 15కోట్ల 49లక్షల 89వేల 635 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.