
భారీ వాహనాలైన లారీలు, బస్సులు, ఇతరత్రా గూడ్స్ వెహికల్స్‌ను మరో కేటగిరీగా భావించి వాటికి జరిమానాలు వేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
భారీ ఫైన్ల దెబ్బకు వాహనాలు వదిలి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఒడిశా రాష్ట్రంలో ఓ ట్రక్కు డ్రైవర్‌కు రూ.86,500 చలాన్ విధించడంతో సంచలనంగా మారింది.
కొత్త మోటార్ వెహికిల్ చట్టం దెబ్బకు వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. భారీ ఫైన్ల దెబ్బకు వాహనాలు వదిలి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఒడిశా రాష్ట్రంలో ఓ ట్రక్కు డ్రైవర్‌కు రూ.86,500 చలాన్ విధించడంతో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే నాగాలాండ్ కు చెందిన బీఎల్ఏ ఇన్ఫ్రాకు చెందిన జేసీబీని ట్రక్కులో ఛత్తీస్ గడ్ తరలిస్తుండగా, ఒడిశాలోని సాంబ్లాపూర్ లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే ట్రక్కుకు సంబంధించిన పత్రాలు సరిగ్గా లేకపోవడంతో డ్రైవర్ అశోక్ జాదవ్ కు చలానా విధించారు. కాగా ట్రక్కు డ్రైవర్ తాను పనిచేస్తున్న ఇన్ ఫ్రా కంపెనీకి ఫోన్ చేసి తెలపగా, వారు పోలీసులతో మాట్లాడి సంబంధిత పత్రాలను చూపించడంతో జరిమానాను రూ.70 వేలకు కుదించగా, ఫైన్ చెల్లించి వాహనాన్ని విడిపించారు. ఇదిలా ఉంటే కొత్త మోటార్ వెహికిల్ చట్టం ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 01 నుంచి అమల్లోకి వచ్చింది.
Published by:Krishna Adithya
First published:September 08, 2019, 19:02 IST