హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Video: సిలిండర్ల లారీలో భారీ పేలుళ్లు.. హైవేపై అల్లకల్లోలం

Video: సిలిండర్ల లారీలో భారీ పేలుళ్లు.. హైవేపై అల్లకల్లోలం

సిలిండర్ల లారీలో పేలుళ్లు

సిలిండర్ల లారీలో పేలుళ్లు

మంటల ధాటికి లారీలో ఉన్న సిలిండర్ల ఒక్కొక్కటిగా పేలాయి. భారీ శబ్దాలతో పేలుళ్లు జరగడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఉగ్రదాడి జరిగిందేమోనని భయపడ్డారు.

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గురువారం మధ్యాహ్నం కాశ్మీర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్పీజీ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగి.. పెద్ద ఎత్తున పేలుళ్లు జరిగాయి. ఉదమ్‌పూర్ జిల్లాలోని మంతల్ ప్రాంతంలో కాళీమాత ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. మంటల ధాటికి లారీలో ఉన్న సిలిండర్ల ఒక్కొక్కటిగా పేలాయి. భారీ శబ్దాలతో పేలుళ్లు జరగడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఉగ్రదాడి జరిగిందేమోనని భయపడ్డారు. సుమారు 45 నిమిషాల పాటు పేలుళ్లు జరిగినట్లు తెలిసింది. జమ్మూ-శ్రీనగర్ హైవేపైనే ఈ ఘటన జరగడంతో.. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఐతే ఘటనా సమయంలో లారీలో ఎవరూ లేరని.. రోడ్డుపక్కన లారీని పార్క్ చేసిన సమయంలో పేలుళ్లు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు.


First published:

Tags: Jammu and Kashmir, Kashmir, LPG Cylinder

ఉత్తమ కథలు