కూతురు ముఖానికి ముసుగెందుకు? రెహమాన్‌ను ఆటాడుకున్న నెటిజెన్లు

నెటిజెన్ల ట్రోలింగ్ తనదైన స్టైల్లో స్పందించారు ఏఆర్ రెహ్మాన్. ఆయన కుటుంబ సభ్యులు నీతా అంబానీతో దిగిన ఫొటోను షేర్ చేసి గట్టిగా కౌంటరిచ్చారు. ఆ ఫొటోలోనూ ఖతీజా ముసుగు ధరించే ఉంది. రెహమాన్ భార్య రహీమా, మరో కూతురు సైరా మాత్రం తమ ముఖాలను ప్రదర్శించారు. 'ఎంచుకునే స్వేచ్ఛ' ఉందంటూ ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: February 7, 2019, 6:13 PM IST
కూతురు ముఖానికి ముసుగెందుకు? రెహమాన్‌ను ఆటాడుకున్న నెటిజెన్లు
ముఖానికి ముసుగు ధరించి తండ్రిని ఇంటర్వ్యూ చేస్తున్న ఖతిజా
  • Share this:
సెలబ్రిటీలు ఏం పొరపాటు చేసినా నెటిజన్లు ఆటాడుకుంటారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ చుక్కలు చూపిస్తారు. సాదాసీదా నటులైనా..స్టార్ హీరోలైనా.. ఎవ్వరినీ వదలరు. అందరినీ ఏకిపారేస్తుంటారు. తాజాగా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌కు సైతం ఇదే అనుభవం ఎదురైంది. ఇటీవల ఓ కార్యక్రమానికి కూతురు ఖతిజాతో కలిసి హాజరయ్యారు రెహ్మాన్. ఐతే ఆమె ముఖాన్ని ముసుగుతో కవర్ చేసుకోవడాన్ని నెటిజన్లు టార్గెట్ చేశారు. కూతురి స్వేచ్ఛని తండ్రి హరిస్తున్నారని..రెహమాన్ బలవంతం చేసినందుకే ఆమె ముఖాన్ని దాచుకుందని ఆడేసుకుంటున్నారు.

ఇటీవల ముంబైలో 'స్లమ్ గాడ్ మిలయనీర్' సినిమా పదో వార్షికోత్సవ వేడుక జరిగింది. ఆ సినిమాకు పనిచేసిన వారంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఏఆర్ రెహమాన్ కూతురితో పాటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సంద్భంగా వేదికపై తండ్రి రెహమాన్‌ను ఇంటర్వ్యూ చేసింది కూతురు ఖతిజా. ఐతే ఆమె ముఖం కనిపించకుండా ముసుగు ధరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వస్త్రధారణ విషయంలో నిబంధనలు పెట్టినందుకే ఖతిజా ముఖాన్ని కవర్ చేసుకుందని.. రెహమాన్‌పై విమర్శలు గుప్పించారు. ఇది సిగ్గుచేటు అంటూ దుమ్మెత్తిపోశారు


నెటిజెన్ల ట్రోలింగ్ తనదైన స్టైల్లో స్పందించారు ఏఆర్ రెహ్మాన్. ఆయన కుటుంబ సభ్యులు నీతా అంబానీతో దిగిన ఫొటోను షేర్ చేసి గట్టిగా కౌంటరిచ్చారు. ఆ ఫొటోలోనూ ఖతీజా ముసుగు ధరించే ఉంది. రెహమాన్ భార్య రహీమా, మరో కూతురు సైరా మాత్రం తమ ముఖాలను ప్రదర్శించారు. 'ఫ్రీడం టు చూస్' హ్యాష్‌ట్యాగ్‌తో ఆ ఫొటోను ట్వీట్ చేశారు రెహమాన్.'ఎంచుకునే స్వేచ్ఛ' ఉందంటూ తనను విమర్శించే వారికి కౌంటర్ ఇచ్చారు.
అటు తన తండ్రిపై వస్తున్న విమర్శలపై ఖతిజా సైతం మండిపడ్డారు. తన ఇష్టప్రకారమే ముసుగు ధరించానని..తనకు అలా ఉండడమే నచ్చుతుందని చెప్పుకొచ్చారు. ముసుగు ధరించాలని..ఎవరూ బలవంతపెట్టలేదని క్లారిటీ ఇచ్చారు. తానేం చిన్నపిల్లను కాదని...జీవితానికి సంబంధించి తానే నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టంచేశారు. 'ఎంచుకునే స్వేచ్ఛ' తనకు ఉందటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసింది ఖతిజా.
First published: February 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>