హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Pushpa : పుష్పగా మారి..భర్త ఫ్రెండ్ నే పెళ్లి చేసుకున్న ముగ్గురు పిల్లల తల్లి!

Pushpa : పుష్పగా మారి..భర్త ఫ్రెండ్ నే పెళ్లి చేసుకున్న ముగ్గురు పిల్లల తల్లి!

భర్త ఫ్రెండ్ తో రుబీనా పెళ్లి

భర్త ఫ్రెండ్ తో రుబీనా పెళ్లి

Woman marries her husband friend : 9 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను విడిచిపెట్టి తన భర్త స్నేహితుడిని పెళ్లి చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Woman marries her husband friend : 9 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను విడిచిపెట్టి తన భర్త స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. ఇందుకోసం మతం మార్చుకొని పేరు కూడా మార్చుకుంది ఆ మహిళ. అయితే ఆ మహిళా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను వీడి మతం మారి పేరు మార్చుకుని భర్త స్నేహితుడిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసుకోండి.

అసలేం జరిగిందంటే

9 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్(Uttarpradesh) రాష్ట్రంలోని రాంపూర్ కి చెందిన రుబీనా ఖాన్ (Rubina Khan)..హల్ద్వానీకి చెందిన షోయబ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు ఎనిమిదేళ్లు, రెండోవాడికి ఆరేళ్లు, మూడోవాడికి నాలుగేళ్లు. పెళ్లయిన కొద్దిరోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. షోయబ్ కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. నాలుగేళ్ల క్రితం నవాబ్‌గంజ్‌లో నివాసి అయిన ప్రేమ్‌పాల్‌ గంగ్వార్ అనే కారు డ్రైవర్ తో షోయబ్ కు పరిచయం ఏర్పడింది.ప్రేమ్​పాల్​ తరచూ షోయబ్ ఇంటికి వస్తుండేవాడు. అలా రుబీనాకు దగ్గరయ్యాడు. నిత్యం ఫోన్ లో రుబీనా-ప్రేమ్‌పాల్‌ మాట్లాడుకునేవారు.

Senior Citizen FDs: సీనియర్ సిటిజన్లకు బ్యాడ్‌న్యూస్..ఈ బ్యాంకుల్లో స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ బంద్

షోయబ్​కు రుబీనాపై అనుమానం మొదలవడంతో ఆమెను తరచూ ఆమెను వేధిస్తుండేవాడు. ఎవరితో మాట్లాడుతున్నావ్​ అంటూ హింసించేవాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం షోయబ్.. రుబీనాకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో రుబీనా తన ప్రియుడు ప్రేమ్​పాల్​ దగ్గరకు వెళ్లిపోయింది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రేమ్‌పాల్‌ ని కోరగా దీనికి అతడు అంగీకరించాడు. దీంతో హిందూ మతాన్ని స్వీకరించిన రుబీనా తన పేరుని పుష్పగా మార్చుకొని శుక్రవారం సాయంత్రం బరేలీలో హిందూ ఆచారాల ప్రకారం ప్రేమ్‌పాల్ గంగ్వార్‌ను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ వివాహానికి బరేలీకి చెందిన కెకె శంఖ్‌ధర్ సాక్షిగా మారారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Marriage, Pushpa, Uttar pradesh

ఉత్తమ కథలు