హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bypolls Results: ఉప ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిన బీజేపీ..సత్తా చూపిన టీఎంసీ,కాంగ్రెస్

Bypolls Results: ఉప ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిన బీజేపీ..సత్తా చూపిన టీఎంసీ,కాంగ్రెస్

ఉప ఎన్నికల ఫలితాలు విడుదల(ప్రతీకాత్మక చిత్రం)

ఉప ఎన్నికల ఫలితాలు విడుదల(ప్రతీకాత్మక చిత్రం)

Bypolls Results: దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక్కసీటు కూడా గెలవలేకోయింది. నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్‌సభ నియోజకవర్గానికిఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి.

ఇంకా చదవండి ...

Bypolls Results: దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(BJP) ఒక్కసీటు కూడా గెలవలేకోయింది. నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్‌సభ నియోజకవర్గానికిఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు(Bypolls Results) ఇవాళ విడుదలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. అందరి దృష్టిని ఆకర్షించిన వెస్ట్ బంగాల్‌ లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌..ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించింది. అసన్‌ సోల్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఎంసీ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన ప్ర‌ముఖ సినీ న‌టుడు శతృఘ్ను సిన్హా...,బీజేపీ అభ్యర్ధి అగ్నిమిత్రాపై 3లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఇక, బెంగాల్ లోని బల్లిగంజ్ అసెంబ్లీ స్థానంలోనూ తృణమూల్‌ అభ్యర్థి బాబుల్‌ సుప్రియో 22వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాగా, ఈ ఉప ఎన్నికల్లో గెలిచిన వీరిద్దరూ గతంలో బీజేపీ నేతలే కావడం గమనార్హం.

ఇక, బీహార్‌ లోని బొచ‌హాన్ అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో(Bypoll) లూలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ సత్తా చాటింది. బొచహాన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్రీయ జనతా దళ్‌(RJD) అభ్యర్థి అమర్‌కుమార్‌ పాసవాన్‌..బీజేపీ అభ్యర్థి బేబీ కుమారిపై 35 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

ALSO READ RSS Worker : ముస్లిం వ్యక్తి హత్య జరిగిన 24 గంటల్లోనే..RSS కార్యకర్తను నరికి చంపేశారు!

 మరోవైపు,ఛత్తీస్‌గఢ్‌ లోని కైరాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. కైరాగర్‌ స్థానంలో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి యశోదా వర్మ 20 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే జోరు కొనసాగించింది. కొల్లాపూర్ నార్త్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జాదవ్ జయశ్రీ చంద్రకాంత్..బీజేపీ అభ్యర్థి సత్యజీత్‌ కదమ్‌పై 18 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్సీపీ, శివసేన పోటీకి దూరంగా ఉన్నాయి. మొత్తం ఈ ఉప ఎన్నికల్లో ఎన్నిక‌ల్లో ఏ ఒక్క చోట కూడా బీజేపీ విజ‌యం సాధించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.


మహారాష్ట్ర ఉపఎన్నికలో బీజేపీ ఓటమిపై శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్‌ సెటైర్లు వేశారు. మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లు పెట్టడంపై వివాదస్పదం చేసి ఉపఎన్నికల ప్రచారంలో దిగిన బీజేపీ ఎత్తులు ఫలించలేదని ఎద్దేవా చేశారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో మతపరమైన అల్లర్లును సృష్టించి..ఉపఎన్నికల్లో లబ్ధి పొందాలన్న బీజేపీ వ్యూహం ఫలించలేదనని సంజయ్ రౌత్ అన్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bjp, Congress, Elections, TMC

ఉత్తమ కథలు