• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • TRINAMOOL CONGRESS MP SUNIL MONDAL FIRES ON ELECTION STRATEGIST PRASHANT KISHOR IN WEST BENGAL AK

Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ అద్దె పోరాట యోధుడు.. మండిపడ్డ తృణమూల్ ఎంపీ

Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ అద్దె పోరాట యోధుడు.. మండిపడ్డ తృణమూల్ ఎంపీ

ప్రశాంత్ కిశోర్( ఫైల్ ఫోటో)

Prashant kishor: రాజకీయాలు చేయడం కోసం డబ్బులు తీసుకునేవారికి ఏమీ తెలుసుకోలేరని ప్రశాంత్ కిశోర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సునీల్ మండల్.

  • Share this:
    తృణమూల్‌పై విమర్శలు చేస్తున్న కొందరు సహచరుల తరహాలోనే ఆ పార్టీ ఎంపీ సునీల్ మండల్ కూడా సొంత పార్టీపై తిరుగుబాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిశోర్‌ను అద్దె పోరాట యోధుడిగా అభివర్ణించారు ఎంపీ సునీల్ మండల్. అద్దె పోరాట యోధులు యుద్ధాన్ని గెలవలేరని ప్రశాంత్ కిశోర్‌ను ఉద్దేశించి అన్నారు. వారి ఆదేశాలను తాను పాటించలేనని వ్యాఖ్యానించారు. ఆయన కంటే తాము విద్యార్హతలోనూ, రాజకీయంగా చాలా అవగాహన కలిగిన వాళ్లమని అన్నారు. ఈ రకంగా పార్టీని నడపలేమని తెలిపారు. ప్రశాంత్ కిశోర్‌కు బెంగాల్ రాజకీయాల గురించి ఏం తెలుసని సునీల్ మండల్ ప్రశ్నించారు.

    పార్టీ నిర్మాణం అంత బలంగా లేదని.. అందుకే పార్టీ నిలదొక్కకోవడం కష్టంగా మారిందని అన్నారు. రాజకీయాలు చేయడం కోసం డబ్బులు తీసుకునేవారికి ఏమీ తెలుసుకోలేరని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సునీల్ మండల్ ఆరోపించారు. పార్టీ కోసం పోరాడే నేతలంతా పార్టీపై తిరుగుబాటు చేసే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. కోకన్ దాస్, జితేంద్ర తివారీ వంటి వారంతా పార్టీలో నంబర్‌వన్ పోరాటయోధులు. అయితే పార్టీలో నెలకొన్న పరిస్థితులు వారిని తిరుగుబాటు చేసేలా చేశాయని తెలిపారు. పార్టీలో క్రిమినల్స్‌తో పాటు టెన్షన్ పెంచేవారికి ప్రాధాన్యత లభిస్తోందని ఆయన అన్నారు. ఇది పార్టీ కోసం పని చేసేవారికి ఆగ్రహం కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు.

    ఇదిలా ఉంటే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో అసంతృప్తి నేతల జాబితా పెరుగుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన బుర్ద్వాన్ పర్బా ఎంపీ సునీల్ మండల్ ఈ జాబితాలో చేరడం తృణమూల్ నేతలను టెన్షన్ పెడుతోంది. తృణమూల్‌కు చెందిన కీలక నేత సువెందు అధికారి బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్న మరుసటి రోజే సునీల్ మండల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
    Published by:Kishore Akkaladevi
    First published: