హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Kargil Vijay Diwas: కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు.. విజయ్ దివస్ మన సైనిక దళాల పరాక్రమానికి ప్రతీక : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Kargil Vijay Diwas: కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు.. విజయ్ దివస్ మన సైనిక దళాల పరాక్రమానికి ప్రతీక : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు.. విజయ్ దివస్ మన సైనిక దళాల పరాక్రమానికి ప్రతీక : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు.. విజయ్ దివస్ మన సైనిక దళాల పరాక్రమానికి ప్రతీక : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కార్గిల్(Kargil) యుద్ధంలో పాక్‌పై భారత్ విజయం సాధించి నేటికి 23 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా భారతీయులందరూ ఈ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకుంటూ.. యుద్ధం(War)లో అసువులు బాసిన వీరుల త్యాగాలను స్మరించుకుంటున్నారు.

కార్గిల్ పేరు చెప్పగానే భారతీయులందరికీ కార్గిల్ యుద్ధమే (Kargil War) గుర్తుకొస్తుంది. 1999లో లడఖ్‌లోని కార్గిల్‌లోకి అక్రమంగా ప్రవేశించి దాన్ని ఆక్రమించుకోవాలకున్న పాక్ సైన్యం, ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీ (Indian Army) హడల్ పుట్టించింది. ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో సైనిక చర్య ప్రారంభించి పాకిస్థాన్ సైనికులు ఆక్రమించుకున్న అన్ని ప్రదేశాలను స్వాధీనం చేసుకుంది. మే 8, 1999న ప్రారంభమైన ఈ యుద్ధంలో మన సైన్యం ధైర్యసాహసాలతో పాటు అద్భుతమైన యుద్ధ వ్యూహాలు ప్రదర్శించింది. ఈ సమయంలో 527 మంది భారతీయ సైనికులు వీర మరణం పొందారు. కార్గిల్‌లో దాదాపు మూడు నెలల పాటు యుద్ధం జరిగిన తర్వాత జులై 26, 1999న భారత సైనికులు పాకిస్థాన్ సైన్యంపై తమ విజయాన్ని ప్రకటించారు. శత్రు సైనికులు వాస్తవాధీన రేఖ వెంబడి ఆక్రమించిన పర్వతాలన్నిటినీ మళ్లీ స్వాధీనం చేసుకుని అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా జులై 26న విజయ్ దివస్ మనమందరం జరుపుకుంటున్నాం.

కాగా ఈ యుద్ధంలో పాక్‌పై విజయం సాధించి నేటికి 23 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా భారతీయులందరూ ఈ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకుంటూ.. యుద్ధంలో అసువులు బాసిన వీరుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. భారత సైనికుల పరాక్రమానికి సెల్యూట్ చెబుతున్నారు. తాజాగా రాష్ట్రపతి ముర్ము, రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు. మంగళవారం అంటే ఈ రోజు ఉదయం ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు అర్పించారు. ఆదివారం జమ్మూలో జరిగిన 'కార్గిల్ విజయ్ దివస్' సంస్మరణ వేడుక కార్యక్రమాల్లో రాజ్‌నాథ్ సింగ్ మనదేశ సామర్థ్యాన్ని అందరికీ గుర్తు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారతదేశంలో అంతర్భాగమని తెలిపారు. మన దేశం బలమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా మారిందన్నారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద త్రివిధ దళాధిపతులు పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు నివాళులు అర్పించారు. త్రివిధ దళాధిపతులైన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. ప్రస్తుతం అప్పటి కార్గిల్ వార్‌కి సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి.

ఇదీ చదవండి: WhatsApp: వారెవ్వా వాట్సాప్.. రోజుకో కొత్త ఫీచర్లు.. ఇక ఎవరికి తెలియకుండా లెఫ్ట్ అయ్యే ఫీచర్.. ఎలాగో లుక్కేయండి !వీరమరణం పొందిన సైనికులకు రాష్ట్రపతి ముర్ము నివాళులు

మంగళవారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. ఈ విజయ్ దివస్ మన సైనిక దళాల అసాధారణ పరాక్రమానికి, సంకల్పానికి ప్రతీక అని, భారతమాతను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన వీర సైనికులందరికీ నమస్కరిస్తున్నానని, దేశప్రజలందరూ వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడూ రుణపడి ఉంటారని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సాయుధ బలగాల శౌర్యం, ధైర్యం & త్యాగానికి నివాళులు అర్పించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. భారత సాయుధ బలగాల ధైర్యసాహసాలు, త్యాగాలకు భారతదేశం సెల్యూట్ చేస్తుందని, వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదని రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా నివాళులర్పించారు. ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు నివాళులు అర్పించారు. జమ్మూలోని బలిదాన్ స్తంభంలో కూడా పుష్పగుచ్ఛాలు ఉంచే కార్యక్రమం జరిగింది.

First published:

Tags: Draupadi Murmu, Kargil Vijay Diwas, Narendra modi, President of India

ఉత్తమ కథలు