Home /News /national /

TRF COMMANDER AFAQ SIKANDER AMONG 5 TERRORISTS KILLED IN 2 SEPARATE ENCOUNTERS IN KULGAM IN JAMMU KASHMIR MKS

Encounter :TRF టాప్ లీడర్ సహా ఐదుగురు టెర్రరిస్టులు హతం -Kulgamలో భారీ ఎన్‌కౌంటర్

కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్

కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్

కుల్గాం జిల్లా లోని పోంబై, గోపాల్‌పురా గ్రామాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. కాగా, చనిపోయిన ఐదుగురు ఉగ్రవాదుల్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)’ సంస్థ కమాండర్ అఫఖ్ సికందర్ కూడా..

ఇంకా చదవండి ...
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు భారత భద్రతా బలగాలు చుక్కలు చూపించాయి. కాశ్మీర్ లోయలో ఉగ్ర కలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)’ సంస్థను దాదాపు మట్టుపెట్టేశాయి. జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో ముష్కర మూకలకు సంబంధించిన కీలక నేతలు ఖతమయ్యారు. జమ్మూకాశ్మీర్ పోలీస్ శాఖ ఐజీ విజయ్ కుమార్ చెప్పిన వివరాలివి...

కేంద్ర పాలిత ప్రాంతం జ‌మ్ముకాశ్మీర్‌ లో ఉగ్రవాదుల పట్ల జీరో టోలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోన్న భద్రతా బలగాలు పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున కూబింగ్, సెర్చింగ్ నిర్వహిస్తున్నాయి. ఆ క్రమంలోనే కుల్గాం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో బుధవారం నాడు సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా, రెండు చోట్ల బలగాలకు ఉగ్రవాదులు తారాసాపడ్డారు. ఈ క్రమంలో భారీ ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయి.

కుల్గాం జిల్లా లోని పోంబై, గోపాల్‌పురా గ్రామాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. కాగా, చనిపోయిన ఐదుగురు ఉగ్రవాదుల్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)’ సంస్థ కమాండర్ అఫఖ్ సికందర్ కూడా ఉన్నాడని పోలీస్ అధికారులు చెప్పారు. కమాండర్ మృతితో టీఆర్ఎఫ్ మనుగడ ఇక ముగిసినట్లేననే భావన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Encounter, Jammu kashmir, Terrorists

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు