ఢిల్లీలో భూప్రకంపనలు.. వణికిన ఉత్తర భారతం

రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదయినట్లు యూరోపియన్-మెడిటేరియన్ సెస్మొలాజికల్ సెంటర్(EMSC) వెల్లడించింది.

news18-telugu
Updated: November 19, 2019, 7:45 PM IST
ఢిల్లీలో భూప్రకంపనలు.. వణికిన ఉత్తర భారతం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేపాల్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. ఆ ప్రభావంతో ఢిల్లీ-NCR సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదయినట్లు యూరోపియన్-మెడిటేరియన్ సెస్మొలాజికల్ సెంటర్(EMSC) వెల్లడించింది. నేపాల్‌లోని దైలేఖ్‌కు 87 కి.మీ. దూరంలో భూమికి 14 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రాత్రి 07.30 సమయంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.





First published: November 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు