హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Black Fungus: బ్లాక్ ఫంగస్‌ చికిత్సకు భారీగా ఖర్చు.. ఆరోగ్య బీమా తీసుకోవడం మంచిదంటున్న నిపుణులు

Black Fungus: బ్లాక్ ఫంగస్‌ చికిత్సకు భారీగా ఖర్చు.. ఆరోగ్య బీమా తీసుకోవడం మంచిదంటున్న నిపుణులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత నెలలో దేశవ్యాప్తంగా రోజుకి 500 వరకు కొత్త బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో 70 శాతం బ్లాక్ ఫంగస్ కేసులు ఇక్కడివేనని సంస్థ నివేదిక తేల్చింది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజల జీవన విధానం అస్తవ్యస్తమైంది. కోవిడ్ భయాల నేపథ్యంలో ఆర్థికంగా, మానసికంగా చతికిలపడ్డ వారికి కొత్త రకం ఫంగస్‌లు నిద్ర పట్టనివ్వట్లేదు. రెండో దశ కోవిడ్ ఉద్ధృతి తరువాత బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇది సాధారణంగా కోవిడ్ నుంచి కోలుకున్న వారికి సంక్రమిస్తుంది. బ్లాక్ ఫంగస్ మరణాల రేటు కూడా మన దేశంలో అత్యధికంగా నమోదవుతోంది. గత నెలలో దేశవ్యాప్తంగా రోజుకి 500 వరకు కొత్త బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా కంటే ముందు కూడా భారత్‌లో ఎక్కువ కేసులున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక చెబుతోంది. ప్రపంచంలో 70 శాతం బ్లాక్ ఫంగస్ కేసులు ఇక్కడివేనని సంస్థ నివేదిక తేల్చింది.

ప్రస్తుతం భారత్‌లో 20,000 యాక్టివ్ బ్లాక్ ఫంగస్ కేసులుండగా, ఇప్పటికే 100 మంది వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి మరణాల రేటు 54 శాతంగా ఉంది. దీంతో కేసులు ఎక్కువగా నమోదవుతున్న పది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ బ్లాక్ ఫంగస్ చికిత్సకు కావాల్సిన మందులను సమకూరుస్తోంది.

చికిత్స ఖర్చు రూ.లక్షల్లో..

దేశ వ్యాప్తంగా యాంటీ ఫంగల్ మెడిసిన్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్కసారి బ్లాక్ ఫంగస్ కు గురైతే ప్రైవేట్ ఆసుపత్రులే దిక్కని వెళ్తున్న వారికి రూ.లక్షల్లో ఖర్చవుతోంది. చికిత్సకు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది. అయితే మన దేశంలో కరోనాకు ముందు బ్లాక్ ఫంగస్ చికిత్స ఖర్చులు.. ఇప్పుటి రేట్లలో సగం మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అనూహ్యంగా రేట్లు పెరగడానికి గల ఏకైక కారణం మందుల కొరతేనని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాణాలు కాపాడే యాంటీ ఇన్ఫెక్షన్ ధర రూ.8,000 నుంచి రూ.10,000 పలుకుతోంది. బ్లాక్ ఫంగస్ రోగికి ప్రతి రోజు 5 నుంచి 6 ఇంజెక్షన్లు వేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ ఇన్ఫెక్షన్ రోగికి ఎక్కువైనప్పుడు.. శరీరం బరువులో ఒక కేజీకి ఒక ఎంజీ డోస్ చొప్పున ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో చికిత్సకు రోజుకి రూ.70,000 నుంచి రూ.1,00,000 వరకు ఖర్చవుతోంది. ఇంత ఖరీదైన వైద్యం అంటే మన దేశంలో చాలా మంది కుటుంబాలకు బరువే.

ఆరోగ్య బీమా పాలసీ దారులకు మేలు!

ఒకవేళ మీరు సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ గనుక తీసుకుని ఉంటే.. ఏమాత్రం బెంగ పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ ఆరోగ్య పాలసీలోనే అన్నిరకాల ఫంగస్ ఇన్ఫెక్షన్ వ్యాధులకు వంద శాతం క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంది. హెల్త్ ప్లాన్ తీసుకునేటప్పుడు ఒక వ్యక్తికి రూ.20 లక్షల వరకు ఒక ఫ్యామిలీకి రూ.కోటి వరకు పాలసీ వర్తించేలా తీసుకోవచ్చు.

First published:

Tags: Black Fungus, Health Insurance

ఉత్తమ కథలు