దేశంలో కరోనా కేసులు (Corona Cases) రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. తాజాగా కేంద్రం నిర్ణయం విదేశీ ప్రయాణికులపై ప్రభావం చూపనుంది. విమానాశ్రయంలో కోవిడ్-19 నెగిటివ్ వచ్చినప్పటికీ, అంతర్జాతీయ ప్రయాణికులందరూ భారత్కు రాగానే 7 రోజుల తప్పనిసరి హోమ్ క్వారంటైన్లో ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. వారు దేశానికి చేరిన 8వ రోజున RT-PCR పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో కేవలం పరీక్షతో ప్రయాణికులను అనుమతించ కుండా క్వారంటైన్ (Quarantine) పెట్టడంతో విదేశీయానం చేసే వారు ఇబ్బంది పడక తప్పదు. ఇప్పటివరకు దేశంలో ఓమిక్రాన్ కేసులలో, 1,199 మంది కోలుకున్నారు లేదా వలస వెళ్లారు. మహారాష్ట్రలో అత్యధికంగా 876, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333, రాజస్థాన్లో 291, కేరళలో 284, గుజరాత్లో 204 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో దేశంలో 1,17,100 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు ముగియడంతో భారతదేశ రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ లక్ష మార్కును అధిగమించింది. 30,836 కొత్త రికవరీలతో, దేశం యొక్క యాక్టీవ్ కేసులు 3,71,363 వద్ద ఉంది. 302 మంది రోగులు ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్తో మరణించారు. వారి సంఖ్య 4,83,178కి పెరిగింది.
WHO: ఒమిక్రాన్ ప్రాణాంతకం కాదు అనేది అవాస్తవం.. జాగ్రత్త తప్పని సరి: డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు (Corona Cases) వేగంగా మళ్లీ పెరగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అయితే కరోనా కొత్త వేవ్ దెబ్బకు ఇబ్బంది పడుతోంది. దేశంలోనూ మళ్లీ కరోనా కేసుల సంఖ్య లక్షకుపైగా వచ్చాయి. దీంతో మూడో వేవ్ (Third Wave) ప్రారంభం అయ్యిందని అందరూ భావిస్తున్నారు. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నా ప్రాణాంతకం కాదని ఇప్పటి వరుకు పలువురు వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. దీనిపై డబ్ల్యూహ్చ్ఓ (WHO) స్పందించింది. ఒమిక్రాన్న తీవ్రతను తక్కువగ ఉందని చెప్పడం అర్థం లేదని స్పష్టం డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధానమ్ అన్నారు. ఒమిక్రాన్ ప్రాణాంతక వేరియంట్ అని పేర్కొంది. ప్రస్తుతం ఒమిక్రాన్ బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని.. ఆయా దేశాలు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువగా గుర్తించిన లక్షణాలు
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona casess, International, Omicron, Omicron corona variant, Travel ban