శబరిమల వివాదంలో కీలక మలుపు... మహిళల ఎంట్రీకి దేవస్థానం ఓకే

ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మహిళలను అనుమతిస్తూ గత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించిన శబరిమల ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం... తాజాగా తన వైఖరి మార్చుకుంది. ఆలయంలోని మహిళలను అనుమతిస్తామని... కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని తెలిపారు.

news18-telugu
Updated: February 6, 2019, 3:18 PM IST
శబరిమల వివాదంలో కీలక మలుపు... మహిళల ఎంట్రీకి దేవస్థానం ఓకే
శబరిమల ఆలయం (ఫైల్ ఫొటో)
  • Share this:
శబరిమల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మహిళలను అనుమతిస్తూ గత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించిన శబరిమల ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం... తాజాగా తన వైఖరి మార్చుకుంది. ఈ విషయాన్ని తాజాగా బోర్డు తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. ఆలయంలోని మహిళలను అనుమతిస్తామని... కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. దీంతో ఈ వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్టే అనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించిన ట్రావెన్ కోర్ బోర్డు... ఆలయంలోకి మహిళలు ప్రవేశించిన వెంటనే ఆలయాన్ని మూసేసి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

sabarimala, sabarimala makarajyothi 2019, sabarimala temple, sabarimala latest news, sabarimala Jyoti 2019, sabarimala ayyappa, sabarimala case, మకరజ్యోతి దర్శనం, శబరిమల వివాదం, శబరిమల ఆలయం, శబరిమల న్యూస్, శబరిమల అయ్యప్ప
శబరిమలలో మకరజ్యోతి దర్శనం


మరోవైపు శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల బాలికలు, మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి దాదాపుగా 54 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై పిటిషనర్ల తరపున న్యాయవాదుల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. ఒకవేళ న్యాయవాదుల వాదనపై అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి... పరిస్థితి ఇలాగే కొనసాగితే దీనిపై విచారణను ముగిస్తామని వ్యాఖ్యానించారు.

After 2 Women Blaze the Trail, Confusion Reigns on Whether Lankan Entered Sabarimala Temple
Illustration by Mir Suhail/News18.com


అయితే ఇది రెండు వర్గాల మధ్య సమస్యకాదని... ఒక మతంపై ప్రభావం చూపే అంశమని న్యాయవాది పరాశరన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం... తీర్పును రిజర్వ్‌లో ఉంచింది అంతకుముందు కేరళ ప్రభుత్వం సైతం తీర్పులో ఎలాంటి మార్పు చేయొద్దని సుప్రీంకోర్టును కోరింది.

ఇవి కూడా చదవండి

First published: February 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading