Home /News /national /

చీర చెంగుతో రాష్ట్రపతికి దిష్టి తీసి.. Transgender మంజమ్మ జోగతికి అందరూ ఫిదా -video

చీర చెంగుతో రాష్ట్రపతికి దిష్టి తీసి.. Transgender మంజమ్మ జోగతికి అందరూ ఫిదా -video

రాష్ట్రపతిని ఆశీర్వదిస్తోన్న పద్మశ్రీ మంజమ్మ జోగతి

రాష్ట్రపతిని ఆశీర్వదిస్తోన్న పద్మశ్రీ మంజమ్మ జోగతి

అతిరథ మహారథులు హాజరైన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ట్రాన్స్‌జెండ‌ర్‌ మంజమ్మ జోగతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చీర కొంగుతో దిష్టితీస్తున్నట్లు తనదైన స్టైల్లో ఆమె రాష్ట్రపతిని ఆశీర్వదించి, నమస్కరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆమె గెశ్చర్ కు ఫిదాగా ప్రధాని మోదీ సహా సభ మొత్తం చప్పట్లు కొట్టారు..

ఇంకా చదవండి ...
ఆమె పేరు పిలవగానే దర్బార్ హాలు మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది.. ముందు వరుసలో కూర్చున్న ప్రధాని మోదీ సైతం ఉత్సాహంగా నవ్వుతూ చప్పట్లు చరిచారు.. ముందుగా సభకు నమస్కరించి వేదిక వైపునకు కదిలిన ఆమె.. వినూత్నరీతిలో రాష్ట్రపతికి నమస్కరించారు.. చీర కొంగుతో దిష్టితీస్తున్నట్లు తనదైన స్టైల్లో ఆమె ఇచ్చిన గౌరవానికి రామ్ నాథ్ కోవింద్ ముగ్ధులైపోగా, సభికులంతా ఫిదా అయ్యారు.. ప్రస్తుతం నెట్టింట వైరలవుతోన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు సైతం ఆమెకు సలాం కొడుతున్నారు..

దేశంలో ఉన్నత పౌరపురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్ దర్బారు హాలులో మంగళవారం కూడా కొనసాగింది. అతిరథ మహారథులు హాజరైన ఆ కార్యక్రమంలో ట్రాన్స్‌జెండ‌ర్‌ మంజమ్మ జోగతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కర్ణాటకకు చెందిన ఫోక్ డాన్సరైన ఆమె.. ప్రసిద్ద జోగమ్మ వారసత్వానికి ప్రతినిధి కూడా. దేశంలో నాలుగో అత్యున్నత పౌరపురస్కారం అందుకున్న రెండో ట్రాన్స్ జెండర్. కర్ణాటక నుంచి ఈ ఘనత పొందిన తొలి ట్రాన్స్‌జెండ‌ర్‌.

క‌ర్ణాట‌క జాన‌ప‌ద అకాడ‌మీకి అధ్య‌క్షురాలిగా ప‌నిచేసిన తొలి ట్రాన్స్‌విమెన్‌గానూ మంజ‌మ్మ జోగ‌తి రికార్డులకెక్కారు. పద్మశ్రీ అవార్డు అందుకునే స‌మ‌యంలో మంజ‌మ్మ జోగ‌తి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను త‌న‌దైన స్టైల్లో ఆశీర్వ‌దించి, నమస్కరించిన తీరు సభికుల్ని ఆకట్టుకుంది. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. తమిళనాడుకు చెందిన నర్తకి నటరాజ్.. దేశంలో పద్మశ్రీ అందుకున్న(2019లో) తొలి ట్రాన్స్ జెండర్ గా నిలిచారు.



ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో ప‌ద్మ అవార్డుల ప్ర‌దానోత్స‌వం ఘనంగా జరిగింది. సోమవారం నాడు.. 2020 ఏడాదికి సంబంధించి 148 మందికి ప‌ద్మ అవార్డుల‌ను ప్రదానం చేసిన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌.. మంగళవారం నాడు 2021 ఏడాదికిగాను 119 మందికి అవార్డుల‌ను అంద‌జేశారు. ఇవాళ ప‌ద్మ అవార్డులు అందుకున్న 119 మందిలో ఏడుగురికి ప‌ద్మవిభూష‌ణ్‌, 10 మందికి ప‌ద్మ‌భూష‌ణ్‌, 102 మందికి ప‌ద్మ‌శ్రీ అవార్డులు ద‌క్కాయి.

ఇవాళ ప‌ద్మ అవార్డులు అందుకున్న వారిలో 29 మంది మ‌హిళ‌లు, ఒక ట్రాన్స్‌జెండ‌ర్ ఉన్నారు. 16 మందికి మ‌ర‌ణానంత‌రం ప‌ద్మ పుర‌స్కారాలు ద‌క్కాయి. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ అందుకున్నారు. లోక్​సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు​ పద్మభూషణ్ అవార్డు ద‌క్కింది. అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్‌కి మ‌ర‌ణానంత‌రం ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారం ద‌క్క‌గా.. ఆయ‌న‌ తరపున ఆయన సతీమ‌ణి అవార్డును అందుకున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Delhi, Padma Awards, President of India, Ramnath kovind

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు