TRAINS CANCELLED TO VISAKHAPATNAM AS ANTI CAB PROTESTS ESCALATE IN NORTHEASTERN STATES SB
విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు
5. ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. కొత్త యూజర్లు యాప్‌లోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. అకౌంట్ యాక్టివేట్ చేయొచ్చు. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ప్రతీసారి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక పిన్ క్రియేట్ చేసుకోవచ్చు. పిన్ ద్వారా లాగిన్ కావొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
చెన్నై-హౌరా, బెంగళూరు సూపర్ ఫాస్ట్, హౌరా సూపర్ ఫాస్ట్, ఫలక్‌నుమా రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి (CAB)వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అనేక రైళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. దీంతో అటువైపుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది విశాఖ రైల్వే అధికారులు. విశాఖ మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దు చేసిన రైళ్ల వివరాలు చూస్తే... చెన్నై-హౌరా, బెంగళూరు సూపర్ ఫాస్ట్, హౌరా సూపర్ ఫాస్ట్, ఫలక్‌నుమా రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మంగళవారం వెళ్లాల్సిన కోరమాండల్-చెన్నై, కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ రైళ్లను కూడా కేన్సిల్ చేసినట్లు తెలిపారు. రద్దయిన రైళ్ల టికెట్ ఛార్జీలను ప్రయాణికులకు తిరిగి చెల్లించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైళ్ల రద్దుతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.