చెన్నైకి వాటర్ ట్రైన్ : నీళ్లు లేక విలపిస్తున్న జనం..

చెన్నై శివారు ప్రాంతాల్లోని ప్రజలు వాటర్ ట్యాంకర్స్ కనిపిస్తే చాలు.. రోడ్లు బ్లాక్ చేసి నీటిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన నీటిని సంపన్నులు, విలాసవంతమైన హోటళ్లకు తరలిస్తున్నారని వాపోతున్నారు.

news18-telugu
Updated: July 12, 2019, 2:48 PM IST
చెన్నైకి వాటర్ ట్రైన్ : నీళ్లు లేక విలపిస్తున్న జనం..
జోలార్‌పెట్టాయ్ నుంచి చెన్నైకి వాటర్ ట్రైన్..
news18-telugu
Updated: July 12, 2019, 2:48 PM IST
చెన్నైని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాలు లేకపోవడం.. చెరువులు,కుంటలు ఎండిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజర్వాయర్లలోనూ చుక్క నీరు లేని పరిస్థితి.ఈ నేపథ్యంలో వేరే ప్రాంతాల నుంచి చెన్నైకి రైళ్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. గురువారం జోలార్‌పెట్టాయ్ నుంచి చెన్నైకి 50వేల లీటర్ల నీటిని రైలు ద్వారా తరలించారు.

చెన్నైలో నీటి కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. కొన్నిచోట్ల స్కూళ్లు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని చెప్పాయి. కొన్నిచోట్ల హోటల్స్ కూడా మూతపడ్డాయి. వాటర్ మేనేజ్‌మెంట్‌లో నిర్లక్ష్యం, వర్షాభావ పరిస్థితులు చెన్నైని ఈ దుస్థితిలోకి నెట్టేశాయి. చెన్నై శివారు ప్రాంతాల్లోని ప్రజలు వాటర్ ట్యాంకర్స్ కనిపిస్తే చాలు.. రోడ్లు బ్లాక్ చేసి నీటిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన నీటిని సంపన్నులు, విలాసవంతమైన హోటళ్లకు తరలిస్తున్నారని వాపోతున్నారు. భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటిపోవడంతో.. చెన్నై ప్రజల నీటి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...