డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన రైలు.. పట్టాలపై రాళ్లు వేసి..

అలా 40 కి.మీ ప్రయాణించిన తర్వాత రైలు దానంతట అదే ఆగిపోయింది. సోజాత్ స్టేషన్ దగ్గర నిలిచిపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

news18-telugu
Updated: September 18, 2019, 3:56 PM IST
డ్రైవర్ లేకుండానే  దూసుకెళ్లిన రైలు.. పట్టాలపై రాళ్లు వేసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పట్టాలపై రైలు ముందుకు కదలాలంటే ఎన్నో క్లియరెన్స్‌లు కావాలి. ఇంజిన్ కండిషన్‌లో ఉండాలి. డ్రైవర్ అన్ని విధాలా ఫిట్‌గా ఉండాలి. స్టేషన్ మాస్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఇంత తతంగం ఉంటుంది. కానీ రాజస్థాన్‌లో ఓ రైలు మాత్రం ఇవేమీ లేకుండానే దూసుకెళ్లింది. అసలు డ్రైవరే లేకుండా 40 కి.మీ. పాటు ప్రయాణించింది. ఎల్ అండ్ టీ కంపెనీ మెటీరియల్ తరలించాల్సిన గూడ్స్ రైలును సెంద్రా రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచారు. ఐతే డ్రైవర్ లేకుండానే ఉన్నట్టుండి రైలు ముందుకు కదిలింది. అతి వేగంతో పట్టాలపై పరుగులు పెట్టింది. అప్రమత్తమైన స్టేషన్ సిబ్బంది, అధికారులు తర్వాతి స్టేషన్లను అలర్ట్ చేశారు.

ముందుజాగ్రత్తగా స్టేషన్లలో కాపలా గేట్లను మూసివేశారు. రైలును ఆపేందుకు పట్టాలపై అక్కడక్కడా బండరాళ్లు, బస్తాలు వేసినప్పటికీ రైలు ఆగలేదు. రైలు వేగం ముందు అవన్నీ చెల్లా చెదరుగా ఎగిరిపోయాయి. అలా 40 కి.మీ ప్రయాణించిన తర్వాత రైలు దానంతట అదే ఆగిపోయింది. సోజాత్ స్టేషన్ దగ్గర నిలిచిపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అది గూడ్స్ రైలు కాబట్టి సరిపోయింది. ప్రయాణికుల రైలు అయి ఉంటే ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యే వారు. మొత్తానికి పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిర పీల్చుకున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>