ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు... 60మందికి పైగా మృతి

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

news18-telugu
Updated: October 31, 2019, 12:09 PM IST
ఎక్స్‌ప్రెస్  రైల్లో మంటలు... 60మందికి పైగా మృతి
పాకిస్తాన్ రైల్లో మంటలు
  • Share this:
పాకిస్థాన్‌లో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 60కు పైగా మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. మరికొందరు తీవ్రగాయాలపాయల్యారు. లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న తేజ్‌గావ్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రహీమ్ యార్‌ఖాన్ సమీపంలోని లియాఖత్‌పూర్ వద్ద రైలులోని గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రయాణికులు చిన్న గ్యాస్ సిలిండర్‌పై వంట చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా రైలులో మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలులో చిక్కుకున్న ప్రయాణికుల్ని కాపాడారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు.ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

First published: October 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>