TRAIN CARRYING FOOD GRAINS TAKES A YEAR TO REACH DESTINATION PVN
Train Late : ఏడాది ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకున్న రైలు..మన దగ్గరే
ప్రతీకాత్మక చిత్రం
Train Delayed One Year late : మన దేశంలో రైళ్ల(Trains) రాకపోకలు ఆలస్యమవడం సర్వ సాధారణమే. నిర్దేశిత సమయం కంటే కొన్ని నిమిషాలు లేదా గంటల తేడాలో గమ్యానికి చేరుకుంటాయి. నిజానికి రైళ్లు లేటుగా రావడం మనకు అత్యంత సాధారణ విషయమే. ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు.
Train One Year late : మన దేశంలో రైళ్ల(Trains) రాకపోకలు ఆలస్యమవడం సర్వ సాధారణమే. నిర్దేశిత సమయం కంటే కొన్ని నిమిషాలు లేదా గంటల తేడాలో గమ్యానికి చేరుకుంటాయి. నిజానికి రైళ్లు లేటుగా రావడం మనకు అత్యంత సాధారణ విషయమే. ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే మొన్న మధ్యప్రదేశ్‌లో ఓ రైలు రావాల్సిన సమయానికంటే 20 నిమిషాలు ముందుగా రావడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. రైళ్లు ఆలస్యంగా వస్తాయని ఇప్పటికే డిసైడైపోయిన జనం ముందుగా రావడంతో ఆనందం పట్టలేక ప్లాట్‌ఫామ్‌పైనే డ్యాన్సులేశారు. బాంద్రా, హరిద్వార్ ఎక్స్ ప్రెస్ కోసం రత్లాం స్టేషన్ కు రాత్రి చేరుకున్నారు. అయితే, దాని సమయంకంటే ముందే ప్లాట్ ఫామ్ మీదకు చేరుకుంది. దీంతో ప్రయాణికులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సంగతి తెలిసి కేంద్ర రైల్వే మంత్రి తెగ ఆనందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కానీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. ఓ గూడ్స్ రైలు ఏడాది ఆలస్యంగా గమ్యస్థానం చేరింది. ఓ గూడ్సు రైలుకు కేవలం 762 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఏకంగా ఏడాది పట్టింది. గమ్యస్థానానికి 2021 మే నెలలో చేరుకోవాల్సి ఉండగా.. అది ఈ నెల 17న వచ్చింది. ఈ సంఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. గతేడాది మే నెలలో చత్తీస్‌గఢ్‌లోని ఓ రైల్వే స్టేషన్ నుంచి ఓ గూడ్సు రైలు వెయ్యి బియ్యం బస్తాలతో ఝార్ఖండ్‌లోని న్యూ గిరిడీ స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే, సాంకేతిక కారణాలతో రైలు నిర్ణీత సమయానికి బయలుదేరలేదు. ఆ తర్వాత ఆ రైలు గురించి అధికారులు మర్చిపోయారు. అలా ఏడాదిపాటు ఎండకు ఎండుతూ.. వానకు నానుతూ పట్టాలపైనే మగ్గిపోయిన ఆ రైలు ఎట్టకేలకు ఈ నెల 17న న్యూ గిరిడీ స్టేషన్‌కు చేరుకుంది. ఆ బోగితో గూడ్సు రైలు ఎట్టకేలకు ఏడాది ఆలస్యంగా మే 17న న్యూ గిరిధీ స్టేషన్‌ను చేరుకుంది.
షెడ్యూల్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వచ్చిన రైలును చూసిన అధికారులు షాకయ్యారు.పేదలకు అందించాల్సిన ఆహార ధాన్యాలు ఏడాది ఆలస్యం కావడంతో.. 200-300 బస్తాల బియ్యం పాడపోయాయని అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటన రైల్వే శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. వ్యాగన్లో సుమారు 1000 బస్తాల ఆహార ధాన్యాలు ఉన్నాయని, వాటిలో 200-300 బస్తాలు చెడిపోయిన స్థితిలో ఉన్నాయని రైల్వే సిబ్బంది ఒకరు తెలిపారు. న్యూగిరిధీ స్టేషన్ మాస్టర్ పంకజ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ అంశంపై తుదుపరి విచారణకు మే 31న ఉన్నతాధికారులు ఇక్కడకు రానున్నారని పేర్కొన్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.