ఇకపై మొబైల్ నంబర్లకు 11 అంకెలు.. అదేం లేదన్నట్రాయ్..

11 అంకెల విధానానికి మారేందుకు తాము వ్యతిరేకమని, కేవలం 10 అంకెల మొబైల్ నంబర్ల విధానాన్ని మాత్రమే కొనసాగించాలని సిఫార్సుల్లో సూచించామని వివరించింది.

news18-telugu
Updated: June 1, 2020, 6:16 AM IST
ఇకపై మొబైల్ నంబర్లకు 11 అంకెలు.. అదేం లేదన్నట్రాయ్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గత కొద్ది రోజులుగా ఇక నుంచి మొబైల్ నంబర్లకు 11 అంకెలు ఉండబోతున్నాయనే ప్రచారం వైరల్‌గా మారింది. భారత టెలికాం రెగ్యులేటరీ ప్రాధికార సంస్థ(ట్రాయ్) చెప్పిందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ట్రాయ్ స్పందిస్తూ మొబైల్ నంబర్లును 11 అంకెలు చేయాలని తామెక్కడా సూచించలేదని స్పష్టం చేసింది. తమ సిఫార్సులను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా అర్థం చేసుకున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. వాస్తవానికి సెల్‌ఫోన్లకు 11అంకెలతో కూడిన నంబర్లను ఉపయోగించాలని ట్రాయ్ ఇటీవల సిఫార్సు చేసింది. ఆ నంబర్లను 9తో ప్రారంభిస్తే రూ.వెయ్యి కోట్ల నంబర్లు అందుబాటులో వచ్చే అవకాశముందుని చెప్పింది. ల్యాండ్ లైన్, మొబైల్స్‌కు కేటాయించేందుకు నంబర్లు ఎక్కువ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ సిఫార్సులు చేసింది.

అయితే 11 అంకెల విధానానికి మారేందుకు తాము వ్యతిరేకమని, కేవలం 10 అంకెల మొబైల్ నంబర్ల విధానాన్ని మాత్రమే కొనసాగించాలని సిఫార్సుల్లో సూచించామని వివరించింది. ఫిక్స్‌డ్ ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ నంబరకు కాల్ చేసే సమయంలో ముందు ‘0’ వినియోగించాలని సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. అంతే తప్ప దీని ఉద్దేశం 11 అంకెలను పెంచడం కాదని ట్రాయ్ చెప్పింది. ఈ కొత్త డయల్ విధానం వల్ల అదనంగా 2544 మిలియన్ నంబర్లు మొబైల్ సంస్థలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సిఫార్సు చేశామని స్ఫష్టం చేసింది.
First published: June 1, 2020, 6:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading