మొబైల్ రింగ్ 30 సెకన్ల పాటు మోగాల్సిందే.. ట్రాయ్ ఆదేశం..

మొబైల్ రింగ్‌పై టెలికం ఆపరేటర్ల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో టెలికం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ జోక్యం చేసుకుంది. మొబైల్ ఫోన్లకు కాల్ చేస్తే 30 సెకన్ల పాటు రింగ్ మోగాల్సిందేనని స్పష్టం చేసింది. ల్యాండ్ లైన్ అయితే 60 సెకన్ల పాటు మోగాలని టెలికం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.

news18-telugu
Updated: November 1, 2019, 8:34 PM IST
మొబైల్ రింగ్ 30 సెకన్ల పాటు మోగాల్సిందే.. ట్రాయ్ ఆదేశం..
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో 10వేల సినిమాలు, షోలు, 400 ఛానళ్లు, వింక్ మ్యూజిక్ లాంటివి అందించనుంది.
  • Share this:
మొబైల్ రింగ్‌పై టెలికం ఆపరేటర్ల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో టెలికం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ జోక్యం చేసుకుంది. మొబైల్ ఫోన్లకు కాల్ చేస్తే 30 సెకన్ల పాటు రింగ్ మోగాల్సిందేనని స్పష్టం చేసింది. ల్యాండ్ లైన్ అయితే 60 సెకన్ల పాటు మోగాలని టెలికం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. వాస్తవానికి గతంలో రింగ్ టైమ్ 45 సెకండ్స్ ఉండేది. ఎవరైనా కాల్ చేస్తే 45 సెకండ్ల పాటు రింగ్ అవుతూ ఉండేది. కాల్ లిఫ్ట్ చేయకపోతే 45 సెకండ్ల తర్వాత డిస్‌కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు మాత్రం రింగ్ టైమ్ 25 సెకండ్ల పాటు మాత్రమే వస్తోంది. వేర్వేరు టెలికామ్ ఆపరేటర్స్ మధ్య కాల్స్ వెళ్తే కాల్ డయల్ చేసిన ఆపరేటర్ కాల్ రిసీవ్ చేసుకున్న ఆపరేటర్‌కు నిమిషానికి 6 పైసలు చెల్లిస్తోంది. దీనివల్ల ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఎక్కువ లాభాన్ని పొందుతున్నాయని జియో ఆరోపిస్తోంది. ఆ కంపెనీలకు జియో ఐయూసీ ఛార్జీలను ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది.

దీంతో, జియో కాల్ రింగ్ టైమ్‌ను 25 సెకండ్లకు తగ్గించింది. ఆ తర్వాత ఇతర టెలికామ్ ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా ఔట్‌గోయింగ్ కాల్స్ రింగ్ టైమ్‌ను తగ్గించాయి. దీంతో రంగంలోకి దిగిన స్పందించిన ట్రాయ్.. రింగ్ టైమ్‌ను 30 సెకన్లకు ఫిక్స్ చేసింది.
First published: November 1, 2019, 8:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading