ఫ్యామిలీలో ఓ వ్యక్తి మరణించాడు. అంత్యక్రియలు చేసి అస్థికలను గంగానదిలో కలిపేందుకు కుటుంబ సభ్యులంతా వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఘోరం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు మరణించారు. హర్యానాలోని జింద్ (Haryana Accident) జిల్లాలో ఈ విషాదకరమైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వ్యాను, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జింద్-కైతాల్ రోడ్డులో కండెలా గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
Hubli Accident: కొంపముంచిన ఓవర్టేక్.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. 9 మంది దుర్మరణం
మృతులను హర్యానాకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా హరిద్వార్ (Haridwar) నుంచి తిరిగి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హిసార్ జిల్లాలోని నార్నౌండ్ గ్రామానికి చెందిన ప్యారేలాల్ ఇటీవల మరణించారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత.. వారి కుటుంబంలోని 23 మంది సభ్యులు చితాభస్మాన్ని గంగా నదిలో నిమజ్జనం చేసేందుకు హరిద్వార్ (Haridwar) కు వెళ్లారు. సోమవారం ఆ కార్యక్రమం ముగిసింది. ప్యారేలాల్ అస్థికలను గంగా నదిలో కలిపారు. హరిద్వార్‌లో దైవ దర్శనం అనంతరం.. మంగళవారం రాత్రి వీరంతా వ్యాన్‌లో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున జింద్-చండీగఢ్ జాతీయ రహదారిపై కండెల గ్రామంలో ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టడంతో ఘోరం జరిగిపోయింది. ఆరుగురు స్పాట్లోనే మరణించారు. మృతుల మృతదేహాలను జింద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మరో 17 మంది గాయపడడంతో వారిని సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Beggar gifts wife :భార్యపై ప్రేమతో..90వేల రూపాయలతో మోపెడ్ కొన్న బిచ్చగాడు
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. కాగా, వారం రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఢిల్లీ-జైపూర్పై ఆగి ఉన్న ట్రక్కును ఓ జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు చనిపోయారు. వీరు కూడా హరిద్వార్ నుంచే వస్తున్నారు. ఫ్యామిలీలో ఒకరు మరణిస్తే.. అతడి అస్థికలను హరిద్వార్‌లోని గంగానదిలో కలిపి.. తిరిగి ఇంటికి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక చిన్నారి ఉంది. ఇప్పుడు హర్యానాలో కూడా ఇలాంటి ప్రమాదమే జరగడంతో.. విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Haryana, Road accident