హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Traffic Rules : పోలీసులు బండి తాళాలు తీయొచ్చా? టైర్లలో గాలి తీయొచ్చా?

Traffic Rules : పోలీసులు బండి తాళాలు తీయొచ్చా? టైర్లలో గాలి తీయొచ్చా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Traffic Rules : రోడ్డుపై కారు(Car) లేదా మోటార్‌సైకిల్‌(Motorcycle)ను నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ నియమాలను(Traffic Rules) పాటించడం తప్పనిసరి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Traffic Rules : రోడ్డుపై కారు(Car) లేదా మోటార్‌సైకిల్‌(Motorcycle)ను నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ నియమాలను(Traffic Rules) పాటించడం తప్పనిసరి. కానీ, బైక్‌పై హెల్మెట్ ధరించకపోవడం, కారులో సీట్ బెల్ట్ ధరించకపోవడం, రెడ్ లైట్ క్రాస్ చేయడం వంటి తొందరపాటు, అనుకోకుండా లేదా మరేదైనా కారణాల వల్ల చాలాసార్లు ప్రజలు అనేక నియమాలను పాటించడం మర్చిపోతారు. అటువంటి పరిస్థితిలో, వాహన యజమానిపై చర్య తీసుకునే హక్కు ట్రాఫిక్ పోలీసులకు(Traffic Police) ఉంది. ట్రాఫిక్ పోలీసుల చర్యలో.. చాలా సార్లు కొంతమంది పోలీసులు దురుసుగా ప్రవర్తించడం కూడా కనిపిస్తుంది. ఒక్కోసారి పర్మిషన్ లేకుండా బైక్‌ కి ఉన్న తాళం తీస్తారు.. ఒక్కోసారి కారణం లేకుండా టైర్‌లోని గాలిని తీసేస్తుంటారు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఇలా ప్రవర్తించడం సరైనదేనా అని ఎప్పుడైనా ఆలోచించారా? పోలీసులు ఇలా ప్రవర్తించడానికి చట్టం అనుమతిస్తుందా?

రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసా?

తనిఖీ సమయంలో మీ కారు నుండి తాళం తీసుకోడానికి, టైరు గాలిని తీసివేయడానికి ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు హక్కు లేదు. ఒక కానిస్టేబుల్ మీ కారు నుండి తాళం తీస్తుంటే, అది నిబంధనలకు విరుద్ధం. నిబంధనల ప్రకారం కానిస్టేబుల్‌కు ఏదైనా వాహనాన్ని సీజ్ చేసే హక్కు లేదు. ఇండియన్ మోటర్ వెహికల్ యాక్ట్ 1932 ప్రకారం అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి అధికారి మాత్రమే చలాన్ వేయగలరు. ట్రాఫిక్  కానిస్టేబుళ్లు వారికి సపోర్ట్ గా మాత్రమే అక్కడ ఉంటారు. ఇది కాకుండా, తనిఖీ సమయంలో పోలీసులు మీతో అనుచితంగా ప్రవర్తించకూడదు. అలా కాదని ఎవరైనా పోలీసు మిమ్మల్ని అనవసరంగా వేధించినా లేదా మీతో దురుసుగా ప్రవర్తించినా మీరు సీనియర్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.

Flying Bike : గాల్లో ఎగిరై బైక్ వచ్చేసిందిగా..దీని ధర,ఫీచర్లు తెలిస్తే వావ్ అనక తప్పదు!

ఈ విషయాలను గుర్తుంచుకోండి

తనిఖీలు చేసే సమయంల పోలీసులు ఎప్పుడూ యూనిఫారంలోనే ఉండటం తప్పనిసరి. అలా యూనిఫాంలో లేకుండా మీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నట్లయితే మీరు వారిని వారి గుర్తింపు కార్డును చూపించమని అడగవచ్చు. వారు IDని చూపించడానికి నిరాకరిస్తే మీరు మీ పత్రాలను వారికి చూపించడానికి కూడా నిరాకరించవచ్చు. చలాన్ వేసే సమయంలో పోలీసుల దగ్గర ఎల్లప్పుడూ చలాన్ బుక్ లేదా ఈ-చలాన్ మెషీన్‌ను కలిగి ఉండటం అవసరం. ట్రాఫిక్ పోలీసులు మీ పత్రాలను జప్తు చేస్తే, రసీదు కూడా తీసుకోవాలి.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Traffic challan, Traffic fine, Traffic police, Traffic rules

ఉత్తమ కథలు