హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ట్రాఫిక్ పోలీసుకి రూ.34వేల ఫైన్... ఎక్కడ వేశారో తెలుసా...?

ట్రాఫిక్ పోలీసుకి రూ.34వేల ఫైన్... ఎక్కడ వేశారో తెలుసా...?

హైద్రాబాద్ లో ప్రమాదాలు ఏ సమయంలో జరుగుతున్నాయనే విషయమై కూడా అధ్యయనం చేశారు. రాత్రి పూట మాత్రమే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అయితే రాత్రి సమయాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్ లను ఉపయోగించాలని భావిస్తున్నారు.

హైద్రాబాద్ లో ప్రమాదాలు ఏ సమయంలో జరుగుతున్నాయనే విషయమై కూడా అధ్యయనం చేశారు. రాత్రి పూట మాత్రమే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అయితే రాత్రి సమయాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్ లను ఉపయోగించాలని భావిస్తున్నారు.

Traffic Fines : ఈ ఫైన్లు కట్టడం కంటే... బండ్లను ఇళ్లలో దాచుకొని... బస్సుల్లో వెళ్లడం బెటర్ అంటున్నారు జనం. కానీ... ఇది కాస్త భిన్నమైన కేసు. అందుకే ఇదేంటో తెలుసుకుందాం.

Ranchi : జార్ఖండ్ రాజధాని రాంచీలో... రాత్రివేళ కానిస్టేబుల్ రాకేష్ కుమార్ బైకుపై హెల్మెట్ లేకుండా దర్జాగా వెళ్లసాగాడు. ఆ బైక్ వెనక కూర్చున్నది ఎవరో కాదు... అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ (ట్రాఫిక్) పరమేశ్వర్ రాయ్. ఇద్దరూ ప్లాజా చౌక్‌ దాకా వెళ్లారు. అక్కడ వాళ్లను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. వాళ్లకు వెయ్యాల్సిన ఫైన్ కంటే డబుల్... అంటే... రూ.34వేల ఫైన్ వేశారు. ఎందుకంటే... చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే... చట్టాన్ని అతిక్రమిస్తే... డబుల్ ఫైన్ వెయ్యాలని... కొత్త ట్రాఫిక్ రూల్స్ చెబుతున్నాయి. ఓ ట్రాఫిక్ పోలీస్‌కి... ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు ఫైన్ వేయడం ఇదే మొదటిసారని రాంచీ అధికారులు చెబుతున్నా్రు. ఈ ఫైన్ వేసినది ఎవరో కాదు... రాంజీ ట్రాఫిక్ ఎస్పీ అజిత్ పీటర్ డుంగ్‌డుంగ్. ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

మీకు డౌట్ వచ్చి ఉంటుంది... అంత భారీ ఫైన్ ఎందుకు వేశారు అని. ఆ ట్రాఫిక్ పోలీస్ దగ్గర హెల్మెట్ మాత్రమే కాదు... డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్, ఇతర డాక్యుమెంట్లు కూడా లేవు. అందువల్ల మొత్తం ఫైన్ రూ.17,000 అయ్యింది. రూల్స్ ప్రకారం డబుల్ వెయ్యాలి కాబట్టి... రూ.34వేలు వేశారు.

ఫైన్ వేసి వదిలేయట్లేదు. ఎందుకంటే వాళ్లు సామాన్య జనం కాదు. ట్రాఫిక్ పోలీసులు. సో... వాళ్లిద్దరిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ట్రాఫిక్ ఎస్పీ అజిత్ పీటర్. తమ శాఖలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన మరో నలుగురిపై చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన... వాళ్లెవరూ ట్రాఫిక్ పోలీసులు కారనీ... ఇతర విధులు నిర్వహిస్తున్నారనీ వివరించారు. ట్రాఫిక్ పోలీసుపై ఇలాంటి చర్యలు తీసుకుంటుండటం ఇదే మొదటిసారి అని తెలిపారు.

నిజానికి ఈ ఫైన్ వేసేవరకూ... డబుల్ ఫైన్ రూల్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఫైన్ వేశాక... ఈ విషయం తెలిశాక... అన్ని జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారులు, ట్రాఫిక్ ఎస్పీలకు సూచన ప్రాయంగా ఆదేశాలు వెళ్లాయి. ట్రాఫిక్ పోలీసులే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే... డబుల్ పెనాల్టీ వెయ్యాలనే ఆదేశాలు వెళ్లాయి. రాంచీలో సెప్టెంబర్ 3 నుంచీ కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకూ 700 మందికి ఫైన్లు వేశారు. రూ.22 లక్షలు వసూలయ్యాయి.

First published:

Tags: Jharkhand, TRAFFIC AWARENESS, Traffic challans

ఉత్తమ కథలు