హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Techies Tractor Ride Video : ట్రాక్టర్లలో ఆఫీసులకి టెక్కీలు..ఒక్కొక్కరికీ ఛార్జీ ఎంతంటే..

Techies Tractor Ride Video : ట్రాక్టర్లలో ఆఫీసులకి టెక్కీలు..ఒక్కొక్కరికీ ఛార్జీ ఎంతంటే..

 ట్రాక్టర్లలో ఆఫీసులకి వెళ్తున్న ఉద్యోగులు

ట్రాక్టర్లలో ఆఫీసులకి వెళ్తున్న ఉద్యోగులు

IT Employees In Tractors : కర్ణాటక(Karnataka) రాజధాని బెంగుళూరు(Bengaluru)ని భారీ వర్షాలు(Heavy Rains) అతలాకుతలం చేస్తున్నాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో ఐటీ కారిడార్‌ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IT Employees In Tractors : కర్ణాటక(Karnataka) రాజధాని బెంగుళూరు(Bengaluru)ని భారీ వర్షాలు(Heavy Rains) అతలాకుతలం చేస్తున్నాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో ఐటీ కారిడార్‌ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో చాలా చోట్ల చెరువులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. వర్షపు నీరు అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. సిటీ ఎయిర్‌పోర్టు ప్రవేశద్వారంలో మోకాళ్ల లోతు నీరు చేరింది. వరద నీటితో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ జామ్‌తో వాహనాల రాకపోకలు స్తంభించాయి. కొన్నిచొట్ల ఊహించని ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి.

బెంగుళూరులో ఎనిమిదేళ్ల తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదుకావడం ఇదే మొదటిసారి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఔటర్‌ రింగ్‌రోడ్డు, సర్జాపుర రోడ్డు, దొడ్డకన్నల్లి రోడ్డు, బెళ్లందూరు ప్రాంతాల్లో రోడ్లపై మోకాల్లోతు నీరు ప్రవహిస్తోంది. మారతహళ్లి స్పైస్‌ గార్డెన్‌ సమీపంలో వాహనాలు నీట తేలాయి. కొన్ని చోట్ల పడవలు, ట్రాక్టర్లలో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా ఐటీ ఉద్యోగులు(IT Employees) అత్యధికంగా ఉండే హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని యమలూర్ నీటిలో మునిగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఐటీ ఉద్యోగులు త‌మ ఆఫీసుల‌కు ట్రాక్ట‌ర్ల‌లో(Tractors) వెళ్తున్నారు. ఆఫీసులో లీవ్‌లు తీసుకునే వెస‌లుబాటు లేద‌ని, అందుకే ట్రాక్ట‌ర్ల‌లో ఆఫీసుకు వెళ్తున్న‌ట్లు ఉద్యోగులు చెబుతున్నారు.

సోషల్ మీడియాలో చూసి..మళ్లీ బతికొస్తాడని ఉప్పులో మృతదేహం,చివరికి ఏమైందంటే


ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మాట్లాడుతూ.."మేము ఎక్కువ సెలవులు తీసుకోలేం ఎందుకంటే మా పని దెబ్బతింటుంది. డ్రాపింగ్ కోసం ట్రాక్టర్ల కోసం ఎదురుచూస్తున్నాం.. ఒక్కొక్కరికీ రూ.50 వసూలు చేస్తున్నారు" అని చెప్పారు. గ‌త 90 ఏళ్ల‌లో ఇలాంటి వ‌ర్షం ప‌డ‌లేద‌ని సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై తెలిపారు. జ‌ల దిగ్భంధం స‌మస్య గురించి ఐటీ కంపెనీల‌తో మాట్లాడ‌నున్న‌ట్లు సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. వర్షం నీరు కారణంగా ఎదురవుతున్న సమస్యలపై ఐటీ కంపెనీలను పిలిపించి మాట్లాడుతామని... వర్షాలతో సంభవించిన పరిహారం, ఇతర సంబంధిత నష్టాలపై కూడా చర్చిస్తాం అని సీఎం తెలిపారు. భారీ వర్షాలకు ఐటీ కంపెనీల కార్యకలాపాలు దెబ్బతినడంతో రూ.225 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఎలక్ట్రానిక్‌ సిటీ ఐటీ కార్యాలయాల సమాఖ్య సీఎంకు ఫిర్యాదు చేసింది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bengaluru, Heavy Rains, Software, Tractors

ఉత్తమ కథలు