బీహార్‌లో ద్విముఖ పోరు... 40 స్థానాలపై NDA చూపు... ఓటు బ్యాంకుపై మహా కూటమి ఆశలు

Lok Sabha Elections 2019 : నితీశ్ కుమార్ పాలనపై బీజేపీ నమ్మకం పెంచుకోగా... ప్రభుత్వ వ్యతిరేకతపై కాంగ్రెస్ ఆధారపడుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 8:28 PM IST
బీహార్‌లో ద్విముఖ పోరు... 40 స్థానాలపై NDA చూపు... ఓటు బ్యాంకుపై మహా కూటమి ఆశలు
నితీశ్ కుమార్ (File)
  • Share this:
ఉత్తరప్రదేశ్ తర్వాత బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకున్న రాష్ట్రం బీహార్. మొన్నటిదాకా బీజేపీకి దూరంగా జరుగుతూ వచ్చిన... అధికార పార్టీ జేడీయూ... చివరి నిమిషంలో కాస్త మెత్తబడి... బీజేపీతోనే పొత్తు పెట్టుకొని బరిలో దిగుతోంది. ఐతే... ఆ రాష్ట్రంలో విజయం సాధించడం బీజేపీకి అంత తేలిక కాదు. ప్రధానంగా కులాల కుంపట్లు ఎక్కువ. మొత్తం 40 లోక్ సభ స్థానాలుండగా... ఇక్కడ 7 దశల్లో పోలింగ్ జరగబోతోంది. ఆరున్నర కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు వెయ్యబోతున్నారు. అధికార జేడీయూ, బీజేపీ, లోక్ జన శక్తి (LJP) పార్టీలు కూటమి (NDA)గా పోటీ చేస్తున్నాయి. RJD (లాలూ పార్టీ), కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (RLSP), లెఫ్ట్ పార్టీలు, లోక్‌తాంత్రిక్ జనతా దళ్ పార్టీ (LJDP - శరద్ యాదవ్) కలిసి మహా కూటమిగా బరిలో దిగుతున్నాయి.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో RJDతో కలిసి పోటీ చేసిన JDU... ఇప్పుడు బీజేపీతో కలిసింది. 40 లోక్ సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు ప్రకారం....

NDA కూటమి :
JDU - 17 స్థానాలు
BJP - 17 స్థానాలు
LJP (రామ్ విలాస్ పాశ్వాన్) - 6 స్థానాలు

మహా కూటమి :RJD - 20
కాంగ్రెస్ - 11
మిత్ర పక్షాలు - 9

2014లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు :
బీజేపీ - 22
LJP - 6
RJD - 4
RLSP - 3
కాంగ్రెస్ - 2
JDU - 2
NCP - 1

ప్రస్తుతం వేవ్ ఎటు ఉందన్నది విశ్లేషకులకు అంతుచిక్కట్లేదు.  కేంద్ర పథకాలు, నరేంద్ర మోదీ పాలనకు తోడు... ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అవినీతి రహిత పాలన తమకు కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది. నితీశ్ సైతం... మంచి పాలన అందిస్తున్నాం... ఇకపైనా అందిస్తామని చెబుతున్నారు. ప్రతిపక్ష మహా కూటమి మాత్రం... ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని నమ్ముతున్నాయి.

కులాల కుంపటి : బీహార్‌లో మొదటి నుంచీ కులాలదే ఆధిపత్యం. ఏ కులం వారు ఎంత మంది అంటే....
EBC - 26 శాతం
SC - 16 శాతం
ముస్లింలు - 17 శాతం
యాదవులు - 13 శాతం
కుష్వాహాలు - 8 శాతం
భూమిహార్లు - 6 శాతం
బ్రాహ్మణులు - 5 శాతం
కుర్మీలు - 4 శాతం
రాజపుత్రులు - 3 శాతం
ఆదివాసీలు - 0.5 శాతం
కాయస్థులు - 0.5 శాతం

ప్రస్తుతం వ్యాపార వర్గాలు, దుషద్‌లు, ఠాకూర్లు, భూమిహారులు, కాయస్థులు కలిసి NDAకి మద్దతిస్తున్నారు. యాదవులు, కుష్వాహాలు, ముషార్లు, ముస్లింలు మహాకూటమి వైపు ఉన్నారు. మొత్తానికి రెండు కూటములూ... జోరుగా ప్రచారం చేస్తూ... గెలుపు దిశగా అడుగులు వేస్తున్నాయి.

 

ఇవి కూడా చదవండి :

18 నెంబర్‌పై చంద్రబాబు ఆశలు... ఈ కొత్త సెంటిమెంట్ ఎందుకో తెలుసా...

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న #TDP #YCP... ఎంత ఖర్చు పెడుతున్నాయంటే...

పాలపుంత నుంచీ దూసుకెళ్లిన పల్సర్... వేగం సెకండ్‌కి 1111 కిలోమీటర్లు... నాసా ప్రకటన

వరల్డ్ కప్ గెలవడం... వాకింగ్ చేసినంత ఈజీ కాదు... కోహ్లీకి ద్రావిడ్ వార్నింగ్
First published: March 21, 2019, 1:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading