Home /News /national /

TOP MAOIST LEADER RAMAKRISHNA WIFE SIRISHA RAISES DOUBTS ON RK DEATH NEWS HERE IS HER SENSATIONAL COMMENTS SK

Maoist Leader RK: మావోయిస్టు నేత ఆర్కేపై విష ప్రయోగం? ఆయన భార్య సంచలన వ్యాఖ్యలు

మావోయిస్టు ఆర్కే (ఫైల్ ఫోటో)

మావోయిస్టు ఆర్కే (ఫైల్ ఫోటో)

Maoist RK: అనారోగ్యంతో చనిపోతే పార్టీకి ఖచ్చితంగా తెలుస్తుందని, పార్టీ పెద్దల నుంచి అధికారిక ప్రకటన వేస్తేనే ఆర్కే మృతిపై క్లారిటీ వస్తుందని విప్లవ రచయితల సంఘం (విరసం) నేతలు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరిగిందని, స్పష్టత వచ్చే వరకు ఆయన మరణ వార్తలను నమ్మలేమని చెబుతున్నారు

ఇంకా చదవండి ...
  మావోయిస్ట్ పార్టీ అగ్రనేత రామకృష్ణ (RK) మృతిపై గందరగోళం నెలకొంది. ఆయన మరణించారని ఛత్తీస్ గఢ్ పోలీసులు గురువారం అధికారికంగా ప్రకటించినప్పటికీ.. కుటుంబ సభ్యులు నమ్మడం లేదు. ఆర్కే ఒకవేళ మరణించి ఉంటే పార్టీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించి ఉండేదని, తమకు కూడా సమాచారం ఇచ్చి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. విప్లవ రచయితల సంఘం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. కానీ మావోయిస్ట్ పార్టీ మాత్రం ఆర్కే మృతిపై ఇప్పటి వరకూ  ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్కే భార్య శిరీష సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్కేకు చనిపోయేంత అనారోగయం లేదని, ఒకవేళ చనిపోతే మాత్రం పోలీసులే చంపేసి ఉంటారని ఆరోపించారు.

  ''ఆర్కేకు చనిపోయేంత అనారోగ్య సమస్యలు లేవు. ఒకవేళ చనిపోయిన మాట వాస్తవమే అయితే పోలీసులే స్లోపాయిజన్ ఇచ్చి ఉండవచ్చు. ఇలా కూడా జరగవచ్చని నేను అనుకుంటున్నా.  మావోయిస్టులకు విషం పెట్టి చంపిన దాఖలాలు గతంలో ఉన్నాయి. దండకారణ్యంలో నేతలకు పోలీసులు మందులు, ఆహారపదార్థాలు అందకుండా చేస్తున్నారు. ఆహార పదార్థాల్లో స్లో పాయిజన్ కలిపి చంపేసిన ఘటనలు గతంలోనూ జరిగాయి. ఆర్కేపై కూడా విష ప్రయోగం చేసి చంపేశారా? లేదంటే  పోలీసులు తమ వ్యూహంలో భాగంగా ఇలా ప్రచారం చేస్తున్నారా? అనేది తెలియాలి. మాకైతే పార్టీ నుంచి ఎలాంటి సమాచారం లేదు. '' అని ఆర్కే భార్య శిరీష్ తెలిపారు.

  బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి.. ఉద్యమమే ఊపిరిగా.. ఇదీ మావోయిస్టు అగ్రనేత ఆర్కే నేపథ్యం

  రామకృష్ణ అనారోగ్యంతో మరణించారని, ఇప్పటికే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని గురువారం ఛత్తీస్‌గఢ్ డీజీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఛత్తీస్‌గఢ్ పోలీసులు తప్ప మిగతా రాష్ట్రాలు ఇప్పటి వరకు స్పందించలేదు. అనారోగ్యంతో చనిపోతే పార్టీకి  ఖచ్చితంగా తెలుస్తుందని, పార్టీ పెద్దల నుంచి అధికారిక ప్రకటన వేస్తేనే ఆర్కే మృతిపై క్లారిటీ వస్తుందని విప్లవ రచయితల  సంఘం (విరసం) నేతలు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరిగిందని, స్పష్టత వచ్చే వరకు ఆయన మరణ వార్తలను నమ్మలేమని చెబుతున్నారు.

  కాగా, తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా జరిగిన అనేక మావోయిస్టు(Maoists) దాడుల్లో ఆర్కే కీలక పాత్ర పోషించారనే వార్తలు ఉన్నాయి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై బాంబు దాడి కేసులోనూ ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆయనను పట్టుకునేందుకు పోలీసులు అనేకసార్లు ప్రత్యేకంగా ఆపరేషన్లు నిర్వహించారు.

  Maoist Top Leader Ramakrishna: మావోయిస్టు అగ్రనేత ఆర్కే అనారోగ్యంతో మృతి

  అనేకసార్లు పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు ఆర్కే. 2004లో నాటి సీఎం వైఎస్ఆర్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపినప్పుడు.. మావోయిస్టుల తరపున చర్చలకు నాయకత్వం వహించారు ఆర్కే. ఆయన ఆచూకీ తెలిపిన వారికి రివార్డులు ప్రకటిస్తామని అనేక రాష్ట్రాలు ప్రకటించాయి. ఒడిశా ప్రభుత్వం రూ. 20 లక్షలు, చత్తీస్‌గఢ్ రూ. 40 లక్షలు, జార్ఖండ్ రూ. 12 లక్షలు, ఆంధ్రప్రదేశ్ రూ. 25 లక్షలు రివార్డులు ప్రకటించాయి. ఏపీలో బలిమెల ఎన్‌కౌంటర్ తరువాత ఆర్కే పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కే పరిమితమైనట్టు పోలీసులు తెలిపారు.

  Dussehra Celebration: దసరా ఉత్సవాలకు అమలాపురం ప్రత్యేకం.. చెడీ తాలింఖన గురించి విన్నారా..?

  ఆర్కే అసలు పేరు అక్కిరాజు హరగోపాల్‌. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తుమ్రుకోట‌. నాలుగు ద‌శాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమాలకు ఆకర్షితుడైన ఆర్కే.. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉద్య‌మ నేత‌గా మారిన స‌మ‌యంలోనే త‌న పేరును రామ‌కృష్ణ అలియాస్ ఆర్కేగా మార్చుకున్నారు. ఆ త‌ర్వాత విప్ల‌వోద్య‌మంలో అగ్ర‌నేత‌గా ఎదిగారు. మావోయిస్టు పార్టీలో అనేక కీలక పదవులను నిర్వహించారు. ఏపీ ఒడిశా స‌రిహ‌ద్దు ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు. నాలుగు ద‌శాబ్దాలుగా అడవిలోనే ఉన్న ఆయ‌న‌.. వైఎస్ హ‌యాంలో ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు. చర్చలు విఫలమైన తర్వాత మళ్లీ అడవుల్లోకి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. ఆర్కేను పట్టుకునేందుకు భద్రతా దళాలు ఎన్నో సార్లు ప్రయత్నించినా.. ఆయన మాత్రం తప్పించుకుంటూ వస్తున్నారు. ఐతే ఇప్పుడు ఆయన అనారోగ్య సమస్యలతో మరణించారన్న వార్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, Chhattisgarh, Maoist, Maoist RK, Maoists, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు