• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • TOP ISRO TAPAN MISRA SCIENTIST SAYS HE WAS POISONED 3 YEARS AGO SK

Tapan Misra: ఇస్రో శాస్త్రవేత్తపై విష ప్రయోగం.. దోశ చట్నీలో ఆర్సెనిక్ కలిపి హత్యాయత్నం

Tapan Misra: ఇస్రో శాస్త్రవేత్తపై విష ప్రయోగం.. దోశ చట్నీలో ఆర్సెనిక్ కలిపి హత్యాయత్నం

తపన్ మిశ్రా

2017 మే 23న బెంగళూరు ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఓ ఇంటర్వ్యూకు తాను హాజరయినట్లు తపన్ మిశ్రా వెల్లడించారు. ఆ రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా దోశ ఇచ్చారని.. ఐతే ఆ దోశ పాటు చట్నీలోదుండగులు ప్రాణాంతక ఆర్సెనిక్ ట్రయాక్సైడ్‌ను కలిపారని తపన్ మిశ్రా ఆరోపించారు.

 • Share this:
  ఇస్రో (ISRO) సీనియర్ సైంటిస్ట్ తపన్ మిత్రా (Tapan Misra) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్ర జరిగిందని..కొందరు వ్యక్తులు  విష ప్రయోగం చేశారని బాంబుపేల్చారు. మూడేళ క్రితం ఈ సంఘటన జరిగిందని వెల్లడించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో 'చాలా రోజులుగా దాచిన రహస్యం' పేరుతో ఓ పోస్ట్ చేశాడు. 2017 మే 23న బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో తనపై విష ప్రయోగం జరిగిందని ఆరోపించారు తపన్ మిశ్రా. దానికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా ఆయన సోషల్ మీడియాలలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రభుత్వం విచారణం చేయాలని తపన్ మిశ్రా డిమాడ్ చేస్తున్నారు. తనను ఎవరు చంపాలనుకున్నారు? ఎందుకు చంపాలనుకున్నారో ప్రజలకు తెలియాలని ఆయన పేర్కొన్నారు.

  2017 మే 23న బెంగళూరు ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఓ ఇంటర్వ్యూకు తాను హాజరయినట్లు తపన్ మిశ్రా వెల్లడించారు. ఆ రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా దోశ ఇచ్చారని.. ఐతే ఆ దోశ పాటు చట్నీలోదుండగులు ప్రాణాంతక ఆర్సెనిక్ ట్రయాక్సైడ్‌ను కలిపారని తపన్ మిశ్రా ఆరోపించారు. అది అత్యంత విషపూరితమైదని.. అది శరీరంలోకి వెళ్తే చనిపోతారని పేర్కొన్నారు. కానీ అదృష్టం కొద్దీ తాను ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. కుట్రపై కేంద్రహోంశాఖ ముందే హెచ్చరించడం వల్లే వైద్య చికిత్స సులువయిందని.. లేదంటే రెండు మూడు వారాల్లోనే తాను చనిపోయేవాడినని తెలిపారు. ఆర్సెనిక్ ట్రయాక్సైడ్ ప్రభావంతో రెండేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డానని ఫేస్‌బుక్ పోస్టులో ఆయన పేర్కొన్నారు. తీవ్ర శ్వాసకోస సమస్యు, చర్మ వ్యాధులతో బాధపడినట్లు వెల్లడించారు. అంతేకాదు ఎయిమ్స్ ఢిల్లీ వైద్యులు ఇచ్చిన రిపోర్టును కూడా ఆ పోస్ట్‌కు జతచేశారు తపన్ మిశ్రా.


  గూఢచర్యంలో భాగంగానే తనపై హత్యాయత్నం జరిగి ఉంటుదని తపన్‌ మిశ్రా అనుమానం వ్యక్తం చేశారు. విష ప్రయోగం గురించి బయటకు చెప్పకూడదంటూ వందల కొద్దీ బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయని.. కొందరైతే క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన తనతో బేరసారాలు కూడా జరిపారని సంచలన ఆరోపణలు చేశారు. వాటిని తాను తిరస్కరించానని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఇస్రో కీలక బాధ్యతల నుంచి తనను తొలగించినట్లు వెల్లడించారు మిశ్రా. ఈ రహస్యాన్ని బహిర్గతం చేయకుండా ఇప్పటికీ తనకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయని చెప్పారు. మానసిక స్థితి సరిగా లేని తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గతేడాది సెప్టెంబరులోనూ తనపై మరోసారి విష ప్రయోగానికి విఫలయత్నం జరిగిందని... ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు.

  ఈయన ప్రస్తుతం ఇస్రో సీనియర్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. జనవరి నెలాఖరులో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. పదవీ విరమణకు కొన్ని రోజుల ముందు చేసిన ఈ పోస్ట్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఘటన జరిగిన మూడున్నరేళ్లు దాటినా ఎందుకు నోరువిప్పలేదు? ఇప్పుడే బయట పెట్టడం వెనక కారణాలేంటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఐతే తపన్ మిశ్రా వ్యాఖ్యలపై ఇప్పటి వరకూ ఇస్రో స్పందించలేదు. మరి ఈయన ఆరోపణలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
  Published by:Shiva Kumar Addula
  First published: