హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Home Minster Amit Shah: నిఘా నీడలో తిరుపతి.. మూడు రోజులు అమిత్ షా పర్యటన.. ఎందుకంటే..?

Home Minster Amit Shah: నిఘా నీడలో తిరుపతి.. మూడు రోజులు అమిత్ షా పర్యటన.. ఎందుకంటే..?

అమిత్ షా తిరుపతి టూర్

అమిత్ షా తిరుపతి టూర్

Home Minster Amit Shah: దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటక మినహా మిగిలిన మూడు రాష్ట్రాలు కేంద్రం తీరుపై మండిపడుతున్న ప్రభుత్వాలే ఉన్నాయి. మొదట్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా నిధుల విడుదల విషయంలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఉత్కంఠ పెంచుతోంది.

ఇంకా చదవండి ...

  Home Minster Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah)తిరుపతి పర్యటన ఖరారైంది. ఆయన తిరుపతి (Tirupati)లో మూడు రోజుల పర్యటన కోసం.. రేపు ( ఈనెల 13న) ఆయన తిరుపతికి రానున్నారు. 14న ఉదయం నెల్లూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (vice President Venkhai Naidu) నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో సదరన్ జోనల్ సీఎంల భేటీలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ నెల 15న శ్రీవారిని దర్శించుకుంటారు. తరువాత అమిత్‌షా ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. అమిత్ షా తిరుపతి పర్యటన నేపథ్యంలో చిత్తూరు-నెల్లూరు (Chitoor-Nellore Districts) జిల్లాల పోలీసు యంత్రాంగాలు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం నవంబర్ 14 ఆదివారం తిరుపతి నగరంలోని తాజ్ హోటల్ లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, లెఫ్టినెంట్ గవర్నర్ లు కూడా రానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన తిరుపతి పర్యటన ఖరారైంది.

  అమిత్ షా సమావేశానికి హాజరయ్యేది ఎవరు..?

  దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇక ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్ లు కూడా హాజరు కానున్నారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కారణంగా, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

  ఇది చూడండి: ఎటు చూసినా భయం భయం.. జలదిగ్బంధంలో రెండు జిల్లాలు.. స్వర్ణముఖి నది ఉగ్రరూపం

  నిఘా నీడన తిరుపతి

  2500 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తుకు రాయలసీమ జిల్లాలతో పాటుగా తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లాలలోని పోలీసులకు విధులు అప్పగించారు. సమావేశం జరగనున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన పోలీసులు, ప్రత్యేక పోలీసు బృందాలను కూడా రంగంలోకి దింపి సమావేశాలు జరిగే చుట్టుపక్కల పరిసరాలను తనిఖీ చేస్తున్నారు. మొత్తం సమావేశం జరిగే ప్రాంతాలలో 14 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

  ఇది చూడండి: ఎందరికో మార్దదర్శిగా మారిన సామాన్యుడు జయదేవ్ భొత్ర.. ఇంతకీ ఏం చేశారో తెలుసా..?

  ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన తిరుపతి మహానగరంలో సమావేశాలు జరుగుతున్న కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, తిరుపతి నగరంలోని లాడ్జిలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, గెస్ట్ హౌస్ లను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కల్వర్టులు, బ్రిడ్జిలను డాగ్ స్క్వాడ్ , బాంబు స్క్వాడ్ లతో తనిఖీలు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం కారణంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలు లెఫ్టినెంట్ గవర్నర్ లు, అమిత్ షా రానున్న నేపథ్యంలో ప్రస్తుతం తిరుపతి నగరం నిఘా నీడలో ఉంది.

  ఇది చూడండి: : మహా పాదయాత్రపై రాజకీయ మంటలు.. రైతుల ముసుగులో టీడీపీ నేతలే దాడి చేశారన్న మంత్రి పేర్నినాని

  అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆ దర్శనాలు రద్దు..

  తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం కోసం వచ్చే భక్తులకు నవంబర్ 13, 14,15 తేదీలలో విఐపి దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం శాఖ మంత్రితో పాటు పలువురు ఉన్నతాధికారుల తాకిడి కారణంగా బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్య మంత్రుల సమావేశం కారణంగా సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చేవారు ఆ మూడు రోజుల్లో రావద్దని పేర్కొన్నారు టీటీడీ అధికారులు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Amit Shah, Andhra Pradesh, AP News, Tirupati

  ఉత్తమ కథలు