Home /News /national /

TOMATO FLU CASES REPORTED IN KERALA WHAT IS TOMATO FLU AND WHAT IS ITS SYMPTOMS HERE IS MORE DETAILS SK

Tomato Flu: మరో కొత్త రోగం.. పిల్లల శరీరంపై ఎర్రటి పొక్కులు.. ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tomato Flu: టోమాటో ఫ్లూ ప్రధానంగా పిల్లల చర్మంపైనే తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. చర్మంపై ఎర్రటి పొక్కులు, దద్దుర్లు, దురద, నోరు పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు అధిక జ్వరం, డీహైడ్రేషన్, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట కూడా టమోటా జ్వరం ప్రధాన లక్షణాలు

ఇంకా చదవండి ...
  రెండేళ్లు గడిచినా కరోనా మహమ్మారి (Corona Virus) మనల్ని ఇంకా వదల్లేదు. రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. వస్తూ.. పోతూ.. జనాల్ని భయపెడుతోంది. ఇంకా కరోనా నుంచి మనం పూర్తిగా కోలుకోకముందే.. దీనికి తోడు కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. తాజాగా కేరళలో మకో కొత్త వ్యాధి బయపడింది. టోమాటో ఫ్లూ (Tomato Flu) అనే అరుదైన వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు కేరళలో పెరిగిపోతున్నాయి. మొదట కొల్లాంలో ఈ వ్యాధి బయటపడింది. ఆ తర్వాత క్రమంగా ఇతర జిల్లాలకు వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 90 మంది దీని బారినపడ్డారు. 5 ఏళ్ల లోపు పిల్లల్లోనే టోమోటో ఫ్లూ కనిపిస్తోంది. ఐతే ఈ వ్యాధి ఎలా సోకిందన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. టొమాటో కేసులు పెరుగుతుండడంతో కేరళ ప్రభుత్వం (Kerala Government) అప్రమత్తమయింది. కేసులను పర్యవేక్షిస్తుండడంతో పాటు కొత్త కేసులు నమోదవకుండా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ముందుజాగ్రత్తగా అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేశారు.

  టొమాటో జ్వరం అంటే ఏమిటి?
  టొమాటో ఫ్లూని టోమాటో ఫీవర్ (Tomato Fever) అని కూడా పిలుస్తారు. ఇది 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకే సోకుతోంది. అయితే ఇది వైరల్ ఫీవరా లేదంటే.. చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరం వల్ల వచ్చిన ఇన్‌ఫెక్షనా ఇప్పటికీ అర్ధం కావడం లేదు. పిల్లల చర్మంపై పొక్కులు ఎర్రగా, గుండ్రంగా టొమాటాల్లా ఉంటాయి. కొన్ని సార్లు వాటి పరిమాణం టమోటాతో సమానంగా ఉంటుంది. అందుకే ఈ వ్యాధిని టొమాటో ఫీవర్ అని పిలుస్తున్నారు. కేరళలోని కొల్లాం జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలు చుట్టుపక్కల జిల్లాలకు కూడా వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి.

  టోమోటా ఫ్లూ లక్షణాలేంటి?
  టోమాటో ఫ్లూ ప్రధానంగా పిల్లల చర్మంపైనే తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. చర్మంపై ఎర్రటి పొక్కులు, దద్దుర్లు, దురద, నోరు పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు అధిక జ్వరం, డీహైడ్రేషన్, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట, దగ్గు, జలుబు కూడా టమోటా జ్వరం ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధి బారినపడిన వారి పిల్లల శరీరం ఎర్రగా మారిపోతుంది. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. పిల్లలు డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూడాలి. తరచూ మంచి నీళ్లను తాగిస్తుండాలి. గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయించండి. శరీరంపై దద్దర్లు ఉంటే వాటిని చేతితో తాకవద్దు. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. టమోటా ఫీవర్ సోకిన రోగితో మీ పిల్లలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

  కేరళలో టోమాటో ఫ్లూ కేసులు పెరుగుతుండడంతో పొరుగు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తమయింది. సరిహద్దుల్లో ఐదేళ్ల లోపు పిల్లలకు పరీక్షలు చేస్తున్నారు. ఇద్దరు మండల స్థాయి ఆరోగ్య అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని రంగంలోకి దించి...వలయార్ చెక్ పోస్ట్ వద్ద ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Kerala, Viral infection

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు