Home /News /national /

Singer Harini Father: సింగర్ హరిణి ఫ్యామిలీ అదృశ్యం.. రైలు పట్టాలపై తండ్రి మృతదేహం

Singer Harini Father: సింగర్ హరిణి ఫ్యామిలీ అదృశ్యం.. రైలు పట్టాలపై తండ్రి మృతదేహం

హరిణి రావు

హరిణి రావు

Singer Harini rao: రైలు పట్టాలపై ఏకే రావు మృతదేహం లభ్యమయింది. మొదట ఆత్మహత్యగా అనుమానించారు. కానీ మెడతో పాటు ఇతర శరీర భాగాల్లో బలమైన గాయాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

  టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ హరిణీ రావు (Singer Harini Rao) కుటుంబం అదృశ్యమైంది. వారం రోజులుగా కనిపించడం లేదు. అంతేకాదు ఆమె తండ్రి  ఏకే రావు (AK Rao) మృతదేహం బెంగళూరులోని రైల్వే పట్టాలపై ఆయన మృతదేహం లభ్యమయింది. రెండు రోజుల క్రితమే ఆయన మరణించినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో హరిణీరావు ఫ్యామిలీ నివసిస్తోంది. కానీ వారం రోజులుగా వీరి ఫ్యామిలీ కనిపించడం లేదు. బంధువులు ఫోన్ చేస్తే అందరి మొబైల్ ఫోన్లు స్విచాఫ్ వచ్చాయి. ఏం జరిగిందోనని వారంతా ఆందోళన చెందారు. కానీ అంతలోనే బెంగళూరులోనే రైలు పట్టాలపై ఏకే రావు మృతదేహం లభ్యమయింది. మొదట ఆత్మహత్యగా అనుమానించారు. కానీ మెడతో పాటు ఇతర శరీర భాగాల్లో బలమైన గాయాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడో హత్య చేసి.. మృతదేహాన్ని రైలు పట్టాలపై విసిరేసినట్లు భావిస్తున్నారు.

  సమంత కాకుండా ముందుగా నాగ చైతన్య ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడా..

  ఏకే రావు సుజనా ఫౌండేషన్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఆయన ఎలా మరణించారు? ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే ఎవరైనా చంపారా? ఒకవేళ హత్య చేస్తే.. ఆయన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆర్థిక లావాదేవీలే కారణమా? లేదంటే ఇంకేదైనా కోణముందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు హరిణి ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎందుకు వెళ్లింది? వారం రోజులుగా అజ్ఞాతంలో ఎందుకు ఉన్నారు? కొన్ని రోజులుగా వారి కుటుుంబంలో అసలేం జరుగుతోంది? ప్రస్తుతం హరిణీతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఏకే రావు మృతిపై పోలీసులు కేసు నమోదు చేేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే ట్రాక్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bengaluru, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు