Vijay Devarakonda: విజయ్ దేవరకొండ నిజంగా అంత బిజీనా.. ‘లైగర్’ తర్వాత అరడజన్ సినిమాల లైనప్..!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ నిజంగా అంత బిజీనా.. ‘లైగర్’ తర్వాత అరడజన్ సినిమాల లైనప్..!
Vijay Devarakonda: తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలలో విజయ్ దేవరకొండ ముందుంటాడు. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి మినిమమ్ గ్యారెంటీ ముద్ర వేసుకున్నాడు ఈ హీరో. దానికితోడు సాలిడ్ హిట్స్ కూడా ఇవ్వడంతో విజయ్ సినిమాలపై క్రేజ్ పెరిగిపోయింది..
Vijay Devarakonda: తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలలో విజయ్ దేవరకొండ ముందుంటాడు. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి మినిమమ్ గ్యారెంటీ ముద్ర వేసుకున్నాడు ఈ హీరో. దానికితోడు సాలిడ్ హిట్స్ కూడా ఇవ్వడంతో విజయ్ సినిమాలపై క్రేజ్ పెరిగిపోయింది..
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలలో విజయ్ దేవరకొండ ముందుంటాడు. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి మినిమమ్ గ్యారెంటీ ముద్ర వేసుకున్నాడు ఈ హీరో. దానికితోడు సాలిడ్ హిట్స్ కూడా ఇవ్వడంతో విజయ్ సినిమాలపై క్రేజ్ పెరిగిపోయింది.. అవకాశాలు కూడా పెరిగిపోయాయి. ఒకట్రెండు విజయాలతోనే స్టార్ హీరో అయిపోయాడు. మధ్యలో కొన్ని డిజాస్టర్స్ వచ్చినా కూడా అవి విజయ్ దేవరకొండ కెరీర్‌పై మాత్రం ప్రభావం చూపించలేదు.
పైగా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత మధ్యలో భారీ గ్యాప్‌లు కూడా ఎప్పుడూ తీసుకోలేదు విజయ్ దేవరకొండ. అయితే భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచడంతో పద్దతులు మార్చుకుంటున్నాడు ఈయన. రెండేళ్లుగా విజయ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు.
2020లో మొదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. నిజానికి 2021లోనే ఇది విడుదల కావాల్సి ఉన్నా కూడా మధ్యలో కరోనా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. లైగర్ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటిస్తున్నాడు. అర్జున్ రెడ్డి డేట్ ఆగస్టు 25న సినిమాను విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉంటే పూరి తర్వాత విజయ్ దేవరకొండ జోరు మామూలుగా లేదు ఏకంగా అరడజను సినిమాలు లైన్‌లో పెట్టాడు. ఇవి కూడా చిన్న సినిమాలు కాదు.. అందులో చాలా మంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పటికే సుకుమార్‌తో తన సినిమా ఉంటుందని చెప్పాడు విజయ్ దేవరకొండ. మొన్న లెక్కల మాస్టారు బర్త్ డే రోజే ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు విజయ్.
2023లో రాంపేజ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. పుష్ప 2 పూర్తయిన తర్వాత సుకుమార్, విజయ్ సినిమా మొదలు కానుంది. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమా చేయబోతుంది. టక్ జగదీష్ ఫ్లాప్ అయినా కూడా మంచి ఫ్యామిలీ స్టోరీ చెప్పడంతో శివతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు విజయ్.
పూరి జగన్నాథ్ సైతం తన కలల ప్రాజెక్ట్ జనగణమన సినిమాను విజయ్ దేవరకొండతోనే చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ చాలా రోజులుగా విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఈయనకు కమిట్మెంట్ కూడా ఇచ్చాడు. కాస్త లేట్ అయినా కూడా ఈ కాంబినేషన్‌లో సినిమా రావడం అయితే పక్కా.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ అందరితోనూ విజయ్ దేవరకొండ టచ్‌లో ఉన్నాడు. ఇవన్నీ అనుకున్నట్లు వర్కవుట్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ మార్కెట్ అమాంతం పెరిగిపోవడం ఖాయం.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.