హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Welcome back Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ రీ ఎంట్రీ.. ఆర్నెళ్ల తర్వాత షూటింగ్‌కు మెగా మేనల్లుడు..

Welcome back Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ రీ ఎంట్రీ.. ఆర్నెళ్ల తర్వాత షూటింగ్‌కు మెగా మేనల్లుడు..

Welcome back Sai Dharam Tej: గతేడాది అనుకోకుండా సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు, నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) 35 రోజుల ట్రీట్మెంట్ తర్వాత 2021, అక్టోబర్ 15న డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన ప్రస్తుతం యాక్టివ్ అయిపోయాడు.

ఇంకా చదవండి ...

    గతేడాది అనుకోకుండా సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు, నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) 35 రోజుల ట్రీట్మెంట్ తర్వాత 2021, అక్టోబర్ 15న డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన ప్రస్తుతం యాక్టివ్ అయిపోయాడు. కొన్ని రోజులుగా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడమే కాకుండా కొత్తగా ఫోటోషూట్స్ కూడా చేస్తున్నాడు. ఈ మధ్య బయటికి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఫోటోలు, వీడియోలు అన్నీ వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు కెమెరా ముందుకు రాలేదు సాయి ధరమ్ తేజ్. యాక్సిడెంట్‌లో అయిన గాయాలతో పాటు కాలర్ బోన్ సర్జరీ సమయంలో వచ్చిన సమస్యలతో కొన్ని రోజుల వరకు కాస్త వీక్‌గా ఉన్నాడు తేజు. అందుకే ప్రమాదం తర్వాత దాదాపు రెండు నెలల పాటు సాయి ధరమ్ తేజ్ ఫోటోలు కూడా బయటికి రాలేదు. దసరాకు కుటుంబంతో పాటు ఉన్న ఫోటోలు విడుదల చేసారు. ఆ తర్వాత పూర్తిగా కోలుకున్నాడు తేజ్.

    ఇప్పుడు అంతా సెట్ అయినా కూడా.. ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఎప్పటికప్పుడు వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటికి వెళ్లినా కూడా వైద్యులు మాత్రం మానిటర్ చేసారు. తేజ్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. ఈయన ఆరోగ్యం అంతా ఉందిప్పుడు. అందుకే ఇప్పుడు షూటింగ్‌కు కూడా వచ్చాడు. కార్తిక్ దండు అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు సాయి. ఆ సినిమా షూటింగ్ మొదలైంది. దానికి వచ్చిన తేజ్‌ను చూసి అభిమానులు ఆనందంగా ఫీల్ అయ్యారు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దీనికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవ్వడంతో సెట్‌లో అందరికీ నమస్కారంతో ఎంట్రీ ఇచ్చాడు తేజ్.

    ఆయనకు పూలాభిషేకంతో యూనిట్ సభ్యులు స్వాగతం పలికారు. కార్తీక్ దండు సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా కమిటయ్యాడు సాయి. అందులో ఒకటి మేనమామ పవన్ కళ్యాణ్‌తో కూడా ఉంది. ఈయన యాక్సిడెంట్ తెలుగులో సంచలనం. చిన్న ప్రమాదమే అనుకున్నా.. అది చాలా పెద్దదని తర్వాతే అర్థమైంది. కొన్ని రోజుల పాటు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ని మెడి కవర్ ఆస్పత్రిలో చేర్పించి కాసేపు చికిత్స అందించారు. ఆ తర్వాత అపోలోకు తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ సినిమాను ఇప్పుడు మొదలు పెట్టిన తేజ్.. పవన్ సినిమాను త్వరలోనే మొదలు పెట్టనున్నాడు.

    First published:

    ఉత్తమ కథలు