మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ బీహార్‌లో టెట్ పరీక్ష రాసింది. మంచి మార్కులతో ఆమె పాసయింది. ప్రస్తుతం అనుపమ టెట్ మార్కుల ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటి అనుపమ మనసు మార్చుకుందా? సినిమాలకు గుడ్‌బై చెప్పి.. టీచర్‌గా అవతారమెత్తనుందా? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మెమోపై అనుపమ ఫొటో ఉన్నా.. అది ఆమెది కాదు. అసలు అనుపమ ఎలాంటి పరీక్ష రాయలేదు. కేరళకు చెందిన అనుపమ.. బీహార్‌లో ఎందుకు టెట్ రాస్తుంది? ఇదంతా అధికారుల తప్పిదం వల్ల జరిగింది. అసలేం జరిగిందంటే.. బీహార్‌కు చెందిన రిషికేశ్ అనే యువకుడు ఇటీవలస్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (STET) రాశాడు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో అతడికి మంచి మార్కులే వచ్చాయి. మ్యాథ్స్ పేపర్ 1లో 150 కి 77.70, మ్యాథ్స్ పేపర్ 2లో 150కి 95.45 మార్కులు వచ్చాయి. ఇంత వరకు బాగానే ఉంది. కానీ మార్క్ షీట్లో రిషికేశ్ ఫొటో లేదు. తన ఫొటోకు బదులు అనుపమ పరమేశ్వరన్ ఫొటో ఉండడంతో అతడు షాక్ తిన్నాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని రిషికేశ్ ఆరోపించాడు. ఐతే అతడి మార్కుల మోమో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. బీహార్ విద్యాశాఖ తీరుపై విమర్శలు రావడంతో.. ఎట్టకేలకు అధికారులు స్పందించారు. ఈ తప్పిదంపై దర్యాప్తునకు ఆదేశించామని బీహార్ విద్యాశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు. ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు.
దీనిపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఇలాంటి తప్పుడు పరీక్షలు,ఫలితాలో కోట్లాది మంది యువత భవిష్యత్‌ను నితీష్ కుమార్ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
सनी लियोनी को बिहार की जूनियर इंजीनियर परीक्षा में टॉप कराने के बाद अब मलयालम अभिनेत्री अनुपमा परमेश्वरन को #STET परीक्षा पास करवा दी है।
नीतीश जी हर परीक्षा-बहाली में धाँधली करा करोड़ों युवाओं का जीवन बर्बाद कर रहे है। एक बहाली पूरा करने में एक दशक लगाते है वह भी धाँधली के साथ। https://t.co/1QJQ8ulqQ2
బీహార్ విద్యాశాఖలో గతంలోనూ ఇలాంటి తప్పిదాలు జరిగాయి. బీహార్ యూనివర్సిటీ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ పార్ట్ 2 పరీక్షల సందర్భంగా ఓ విద్యార్థి దరఖాస్తు ఫారంలో.. తండ్రి పేరు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మిగా పడింది. తల్లి పేరు సన్నీ లియోన్‌గా పేర్కొన్నారు. ఇక అడ్రెస్‌ను ముంబై రెడ్ ఏరియాగా ముద్రించారు. అంతకుముందు జూనియర్ ఇంజనీర్ పరీక్షల్లో సన్నీ లియోన్‌ను టాపర్‌గా ప్రకటించారు. ఇలా వరుస తప్పిదాల నేపథ్యంలో బీహార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అధికారులు మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా? అని విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడ్డారు. బీహార్‌లో తప్ప.. దేశంలో మరెక్కడా ఇలాంటివి జరగవనిన నెటిజన్లు ఏకిపారేశారు. వాటిని మరవక ముందే మరోసారి అలాంటి పొరపాటే జరగడంతో మళ్లీ దుమారం రేగుతోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.