హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Jr NTR Car Traffic Police: జూనియర్ ఎన్టీఆర్ కారును అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు..

Jr NTR Car Traffic Police: జూనియర్ ఎన్టీఆర్ కారును అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు..

Jr NTR Car Traffic Police: టాలీవుడ్ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉన్నాడు ఈయన. రామ్ చరణ్, రాజమౌళితో కలిసి దేశాలతో పాటు రాష్ట్రాలు కూడా తిరుగుతున్నాడు.

ఇంకా చదవండి ...

    టాలీవుడ్ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ (RRR) సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉన్నాడు ఈయన. రామ్ చరణ్ (Ram Charan), రాజమౌళి (Rajamouli) తో కలిసి దేశాలతో పాటు రాష్ట్రాలు కూడా తిరుగుతున్నాడు. ఒక్క రోజులో మూడు రాష్ట్రాలు తిరిగిన రోజులు ఉన్నాయి. కొన్ని రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు మరే పని లేకుండా కేవలం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే తాజాగా ఈయన మరో విధంగా వార్తల్లోకి వచ్చాడు. ఈయన కారును హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మార్చ్ 20 అంటే ఆదివారం రోజు జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ దగ్గర జూనియర్ ఎన్టీఆర్‌ కారును (Jr NTR Car Traffic Police) ట్రాఫిక్ పోలీసులు ఆపారు. అంతేకాదు.. కాసేపు తనిఖీలు కూడా నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం స్క్రీన్‌ను వాళ్లు వెంటనే తొలగించడం జరిగింది. దీనిపై చాలా సేపు రచ్చ జరిగింది.

    ఎందుకంటే కేవలం Y కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు అర్హులు. వాళ్లు కాకుండా ఇంకెవరు కూడా బ్లాక్ ఫిలిం ఉపయోగించడానికి వీల్లేదు. ఈ మేరకు సుప్రీం కోర్టు కూడా ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం ఉండటంతో పోలీసులు వెంటనే వాటిని తొలిగించారు. కేవలం తొలగించడం మాత్రమే కాదు.. జరిమానా కూడా విధించారు. ఈ విషయంలో ఎవరనేది చూడకుండా చాలా స్ట్రిక్ట్ డ్యూటీ చేస్తున్నారు పోలీసులు. ఎంత పెద్ద వాళ్లైనా కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇలాంటి కార్లు ఎక్కడ కనిపించినా వాళ్లు ఉపేక్షించకుండా సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ కారు పోలీసుల కంట పడింది.

    Bheemla Nayak closing WW collections: ‘భీమ్లా నాయక్’ క్లోజింగ్ కలెక్షన్స్.. చివరికి మళ్లీ నష్టాలే మిగిలాయి..!

    ఇక ఆ స్క్రీన్‌పై ఉన్న బ్లాక్ ఫిలింని తొలగించిన తర్వాత ఎన్టీఆర్ కారుకి రూ.700 జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఎన్టీఆర్ కారుని పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో అందులో జూనియర్ లేడు. డ్రైవర్‌తో పాటు తారక్ తనయుడు ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్లతో పాటు మరో వ్యక్తి కూడా కారులో ఉన్నాడు. ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ సినిమా బిజీలో ఉండి కుటుంబంతో ఈ మధ్య సమయం కూడా కేటాయించడం లేదు జూనియర్. మొన్నామధ్య కేవలం తారక్ సతీమణి ప్రణతి ఒక్కరే తన పిల్లలతో కలిసి తిరుమల వెళ్లొచ్చారు. ఈ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కారును పోలీసులు అడ్డుకోవడం మాత్రం ఆసక్తికరంగా మారింది.

    First published:

    ఉత్తమ కథలు