Home /News /national /

TO UNDERSTAND MUTTIAH MURALITHARAN CONTROVERSY ONE HAS TO UNDERSTAND SRI LANKAS TROUBLED PAST NK

ముత్తయ్య మురళీధరన్ వివాదమేంటి? ఇదివరకు శ్రీలంకలో ఏం జరిగింది?

ముత్తయ్య మురళీధరన్ వివాదమేంటి? ఇదివరకు శ్రీలంకలో ఏం జరిగింది? క్లారిటీగా తెలుసుకుందాం

ముత్తయ్య మురళీధరన్ వివాదమేంటి? ఇదివరకు శ్రీలంకలో ఏం జరిగింది? క్లారిటీగా తెలుసుకుందాం

Muttiah Muralitharan Controversy: ముత్తయ్య మురళీధరన్ జీవిత కథతో వస్తున్న సినిమా 800 నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడంతో... అసలేం జరిగిందనే అంశం చర్చకు దారితీసింది.

  Muttiah Muralitharan Controversy: ముత్తయ్య మురళీధరన్... వివాదాలకు కొత్తేమీ కేదు. ఆయనపై ఎన్నోసార్లు ఎన్నో విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. శ్రీలంక క్రికెట్‌లో అడుగు పెట్టినప్పుడు... ఆయన బౌలింగ్ యాక్షన్ చూసి అంతా షాక్ అయ్యారు. అదేంటి అలా వేస్తున్నాడు అని అనుమానించారు. ప్రపంచ క్రికెట్ నుంచి ఆయన్ని తప్పించేంత దాకా వెళ్లింది ఆ వివాదం. ఐతే... ఇలాంటి వివాదాలన్నింటినీ ఎదుర్కొంటూ... ముత్తయ్య మురళీధరన్... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు వరల్డ్ క్రికెట్‌లో మురళీధరన్ వేసే బౌలింగ్ దూస్రా (“doosra”) కూడా ఓ పార్ట్ అయిపోయింది. 1996 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ అర్జున రణతుంగ... పదేళ్లపాటూ... లంకలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్‌తో... మురళీ ధరన్‌కు ఫుల్లుగా మద్దతిచ్చాడు. తద్వారా మురళీ అంచలంచెలుగా ఎదుగుతూ... ఇప్పుడు క్రికెట్ లెంజెడ్స్‌లో ఒకడిగా నిలిచాడు.

  2019 నవంబర్‌లో... తమిళులు ఎక్కువగా ఉండే ఉత్తర శ్రీలంక ప్రాంతానికి మురళీధరన్‌ను గవర్నర్‌ చేయాలనే ప్రతిపాదన వచ్చింది. వెంటనే అక్కడి తమిళులు భగ్గుమన్నారు. తమను అణచివేసే ఉద్దేశంతోనే మురళీధరన్‌ను గవర్నర్ గా చెయ్యాలని కుట్రపన్నుతున్నారని... శ్రీలంక తమిళులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు.

  తాజాగా మురళీధరన్ బయోపిక్ 800పై వివాదం రగులుతోంది. ఈ బయోపిక్ చేస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతికి, ఆయన కుటుంబానికీ పెద్ద ఎత్తున వార్నింగ్స్ వచ్చాయి. ఈ వివాదమంతా ఎందుకనుకున్న విజయ్ సేతుపతి... ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. నిజానికి సేతుపతి తప్పుకోవడం అనేది చాలా చిన్న విషయం. అసలు శ్రీలంకలో తమిళుల అంశంలో ఏం జరిగిందన్నది చాలా పెద్ద విషయం. అందులో వివాదాస్పద అంశాలు కలగలిసి ఉన్నాయి.

  మురళీధరన్... ఇండియన్ తమిళుడు. వీళ్లను మలయాహా తమిళులు అంటారు. ఐతే... అక్కడి చాలా మంది తమిళులు తమను ఇండియన్ తమిళులు అని పిలవడాన్ని ఇష్టపడరు. మలయాహా అంటే... గిరి దేశం అని అర్థం. ఈ మలయాహా తమిళులు... శ్రీలంకలో... అత్యంత సుందరమైన కొండ ప్రాంతాల్లో... టీప్లాంటేషన్లలో పనిచేస్తూ జీవిస్తున్నారు.

  శ్రీలంకలో రెండు రకాల తమిళులు ఉన్నారు. శ్రీలంక తమిళులు, ఇండియన్ తమిళులు. శ్రీలంకలోని ఉత్తర, తూర్పు ప్రాంతంలో ఉండే... శ్రీలంక తమిళులు... తమను తాము స్థానికులుగా భావిస్తారు. ఇండియన్ తమిళులు మాత్రం... తమను తాము భారతీయులుగా భావిస్తారు. 19వ, 20వ శతాబ్దంలో బ్రిటిషర్లు తమ వారిని తమిళనాడు నుంచి బలవంతంగా శ్రీలంకకు తీసుకొచ్చారని, కాఫీ, టీ ఎస్టేట్ లలో పనులకు నియమించారని భావిస్తారు.

  ఇక పేదరికం, కులాల సమస్యలతో... మరికొంత మంది తమిళులు... నౌకల్లో... శ్రీలంక వెళ్లి పనిచేస్తుండటం మరో కోణం. వారి జీవితాలు, బతుకులూ... అత్యంత దయనీయం. కనీసం తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి వారిది. చాలా మంది కొండల్లో పనిచేస్తూనే చనిపోతుంటారు. 1948లో బ్రిటన్ నుంచి శ్రీలంక స్వాతంత్ర్యం పొందినప్పుడు... ఇండియన్ తమిళుల పరిస్థితి అగమ్య గోచరమైంది. ఎందుకంటే... వారికి తమ దేశ పౌరసత్వం ఇచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ఒప్పుకోలేదు. అదే సమయంలో... శ్రీలంక తమిళులు బాగా చదువుకున్నారు, ఆర్థికంగా బలపడ్డారు. రాజకీయాల్లోనూ చక్రాలు తిప్పారు. కానీ... ఇండియన్ తమిళులను వాళ్లు ఆదుకోలేదు, అభివృద్ధి చెయ్యలేదు. ఆధునిక చరిత్రకారుల ప్రకారం... ఇండియన్ తమిళులను అభివృద్ధి చేయడం... శ్రీలంక బౌద్ధులకు, శ్రీలంక తమిళులకు పెద్ద సమస్యేమీ కాదు.

  కాలక్రమంలో ప్లాంటేషన్లలో పనిచేసే ఇండియన్ తమిళులు డౌన్ అయిపోయారు. వారికి చదువు లేదు. డబ్బు లేదు. పౌరసత్వం లేదు. చాలా దారుణమైన పరిస్థితుల్లోకి జారిపోయారు. 1960లో లాల్ బహదూర్ శాస్త్రి - సిరిమావో బండారు నాయకే మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం... సగం మంది ఇండియన్ తమిళులను శ్రీలంక నుంచి ఇండియా పంపించేశారు. వాళ్ల గోడు పట్టించుకోకుండా... నౌక ఎక్కించి... గొర్రెలను పంపినట్లు పంపేశారు. 2000 సంవత్సరంలో చంద్రిక బండారు నాయకే కుమారతుంగ అధ్యక్షతన... ఇండియన్ తమిళులకు శ్రీలంక పౌరసత్వం లభించింది. ఇండియన్ తమిళుల్లో ఉన్న సౌమియామూర్తీ తొండమన్ వంటి నాయకులు... శ్రీలంక ప్రభుత్వంతో లాబీయింగ్ జరిపి... ఇది సాధ్యమయ్యేలా చేశారు.

  LTTE యుద్ధంలో 30 ఏళ్లపాటూ... ఇండియన్ తమిళులు నరకం చూశారు. అటు ఎల్టీటీఈ, ఇటు శ్రీలంక ప్రభుత్వం... ఇద్దరూ వాళ్లను అనుమానిస్తూ... చంపుతూ వచ్చారు. వాళ్లు శ్రీలంక ప్రభుత్వంతో ఉన్నారని ఎల్టీటీఈ... వాళ్లు ఎల్టీటీఈతో ఉన్నారని శ్రీలంక ప్రభుత్వం అనుమానించాయి. ముత్తయ్య మురళీధరన్... ఇండియన్ తమిళులకు కొండ ప్రాంతాల్లో విపత్కర పరిస్థితుల్లో పుట్టాడు. అతని తల్లిదండ్రులు అంత పేదవారేమీ కాదు. కానీ వారి ఫ్యాక్టరీని రెండుసార్లు సర్వనాశనం చేసి... తగలబెట్టాయి శ్రీలంక తెగలు. అలా చాలాసార్లు ఆ ఫ్యామిలీ... మళ్లీ మళ్లీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నించింది. ఆ దృశ్యాలన్నీ చూస్తూనే పెరిగాడు మురళీధరన్.

  స్థానిక విశ్లేషకుల ప్రకారం... మురళీధరన్... అంతర్జాతీయ క్రికెటర్ అవ్వడాన్ని శ్రీలంక తమిళులు ఇష్టపడట్లేదు. ఎందుకంటే... అతను ఇండియన్ తమిళుడు కావడమే. ఇప్పుడు మురళీధరన్ బయోపిక్ పై దుమారం రేగడానికి కూడా కారణం ఇదే. ది హిందూ పత్రిక తరపున శ్రీలంకలో చస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ ఆర్ కే రాధాకృష్ణన్ ఓ ట్వీట్ చేశారు. "నేను ఓ విషయం చెప్పదలచుకున్నాను. శ్రీలంకలోను ఉత్తరాన ఉన్న తమిళులు... ఇండియన్ ప్లాంటేషన్ తమిళుల్ని కనీసం మనుషుల్లాగా కూడా చూడరు. లండన్, ప్యారిస్, టొరంటో లాంటి దేశాల్లో టీవీల్లో కనిపించే ఉత్తరాది శ్రీలంక తమిళులు ప్లాంటేషన్ తమిళులను (మురళీధరన్) ప్రపంచంలో మోస్ట్ పాపులర్ తమిళులుగా ఎప్పుడూ ఒప్పుకోరు" అని ట్వీట్ చేశారు.

  1977లో తన తండ్రిని తమిళ వ్యతిరేక మూకలు చంపినప్పుడు, కుటుంబ బిస్కెట్ ఫ్యాక్టరీని తగలబెట్టినప్పుడు మురళీ ధరన్ వయస్సు ఐదేళ్లు. ఇండియా నుంచి బ్రిటిషర్ల ఒత్తిడితో శ్రీలంక వచ్చి... అక్కడి టీ ఎస్టేట్లలో పనిచేసిన ఫ్యామిలీయే మురళీధరన్ పెద్దలది కూడా. ఇలా... శ్రీలంకకు ప్రపంచస్థాయి క్రికెటర్‌ను ఇచ్చిన ఇండియన్ తమిళులకు ఆ దేశంలో... పేదరికం, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు, చీదరింపులు, చిన్నచూపులు వంటివే ఇప్పటికీ ఉన్నాయి.

  (DP సతీష్, న్యూస్18)
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Muthia Muralitharan, Sri Lanka

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు