Home /News /national /

TO STOP CRIMES AGAINST WOMAN UTTAR PRADESH POLICE USES BOLLYWOOD MOVIE CLIPS NK GH

UP Police: మహిళల్లో అవగాహనకు ఉత్తరప్రదేశ్ పోలీసుల సరికొత్త ప్రయోగం... భలే ఉందిగా...

మహిళల్లో అవగాహనకు ఉత్తరప్రదేశ్ పోలీసుల సరికొత్త ప్రయోగం (image courtesy - twitter)

మహిళల్లో అవగాహనకు ఉత్తరప్రదేశ్ పోలీసుల సరికొత్త ప్రయోగం (image courtesy - twitter)

Crime against woman: ఏం చేస్తే మహిళలపై నేరాలు ఆగుతాయి? మహిళలను మరింత అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏం చేశారో వీడియో చూడండి.

Crime against woman: సినిమాలు ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాంటి సామాజిక కోణంలో వచ్చే సినిమాల ప్రభావం ప్రజలపై ఎక్కువే ఉంటుంది. అందువల్లే ఉత్తరప్రదేశ్ పోలీసులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పౌరుల సామాజిక బాధ్యతను వివరించేందుకు సినిమాను ఆయుధంగా ఎంచుకున్నారు. ఈమధ్య కాలంలో ఉత్తరప్రదేశ్‌లో నేరాలు, రేప్‌లూ పెరుగుతున్నందున వాటిని ఆపేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా 1993లో వచ్చిన జూహి చావ్లా, షారూఖ్ ఖాన్ ‘డార్’ చిత్రం, 2016లో వచ్చిన అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్నూ ‘పింక్’ చిత్రాలను ఎంచుకున్నారు. వీటి ద్వారా మహిళల్లో అవగాహన కల్పించాలని ప్రయత్నించారు. ఈ సినిమాల్లోని సీన్లను కలిపి ఓ క్లిప్ తయారుచేశారు. దీన్ని యూపీ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.

ఇప్పుడు ఈ క్లిప్‌కి నెటిజన్ల నుంచి అదిరే రెస్పాన్స్ వస్తోంది. కేవలం 17 సెకన్లు ఉన్న ఈ క్లిప్‌లో మొదట జూహీ చావ్లా నటించిన ‘డార్’ చిత్రంలోని ‘జాదు తేరి నజర్’ అనే పాట వస్తుంది. ‘‘తు హ కర్ యా నా కర్, తు హై మేరీ కిరణ్” అనగా ‘‘నువ్వు అవునన్నా కాదన్నా నువు నాదానివే’’ అని హీరో పాట పాడుతుండగా, దీనికి ప్రతిస్పందనగా అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ చిత్రంలోని కోర్టు గదిలో సన్నివేశం వస్తుంది. అమితాబ్ కోర్టులో నిలబడి చెప్పే పాపులర్ డైలాగ్, ‘లేదు అంటే లేదు’ అనే సన్నివేశం వస్తుంది. మహిళలు కీచకుల వలలో చిక్కుకొని మోసపోతున్నారని, వారి పట్ల అప్రమత్రంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దీన్ని రూపొందించారు. వీడియో చివర్లో 112, 1090 రెండు టోల్ ఫ్రీ నంబర్లను కూడా పోలీసు శాఖ పంచుకుంది. అనుచిత వ్యక్తుల ద్వారా వేధింపులు ఎదురైతే మహిళలు ఈ నంబర్లకు ఫోన్ చెయ్యాలని సూచించారు.


సూపర్ అంటున్న నెటిజన్లు:
ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రయత్నాన్ని ట్విట్టర్ నెటిజన్లు అభినందిస్తున్నారు. ఉర్మి అనే నెటిజన్ స్పందిస్తూ ‘‘అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఇతివృత్తంతో మహిళల్లో అవగాహన పెంచేందుకు చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది.” అని అన్నారు. రుచీ పాండే అనే మరో నెటిజన్ ‘‘ఉత్తర ప్రదేశ్ పోలీసులు రూపొందించిన ఈ వీడియో ఎంతో సృజనాత్మకంగా ఉంది" అన్నారు. నైతిక పాఠం నేర్పడానికి వినూత్న ఆలోచనలను ఉపయోగించినందుకు యుపీ పోలీసులను అభినందిస్తున్నానని మరో ట్విట్టర్ యూజర్ సర్వేష్ శ్రీవాస్తవ అన్నారు. ఈ వీడియోను కోట్-ట్వీట్ చేస్తూ, వినయ్ వర్మ అనే యూజర్ రాష్ట్రంలో నేరాల రేటును ప్రశ్నిస్తూ... యుపీ పోలీసులు ఇచ్చిన ఈ కొత్త సందేశం ద్వారా మహిళల్లో చైతన్యం పెరిగి నేరాలు తగ్గుతాయని భావిస్తున్నట్లు చెప్పారు.



ఈమధ్య, యూపీ పోలీసులు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇలాంటిదే మరో ప్రయత్నం కూడా చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని హెచ్చరిస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 1975లో వచ్చిన షోలే అనే సూపర్ హిట్ చిత్రంలోని సన్నివేశాన్ని ఉపయోగించారు. అది కూడా వైరల్ అయ్యింది.



మొత్తానికి యూపీ పోలీసు శాఖ కూడా జనరేషన్‌కి తగ్గట్టు క్రియేటివ్‌గా ఆలోచిస్తోంది. ఈ ప్రయత్నం కలిసొచ్చి... క్రైమ్ కేసులు తగ్గితే మంచిదే.
Published by:Krishna Kumar N
First published:

Tags: Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు