హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఎలుకల భయంతో పిల్లులను పెంచుతున్న పోలీసులు..రూ.20 లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం

ఎలుకల భయంతో పిల్లులను పెంచుతున్న పోలీసులు..రూ.20 లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cats in police station : ఎలుకల భయంతో పిల్లలను పెంచుకుంటున్నారు పోలీసులు. పట్టుకుందామని ఎంత ప్రయత్నించినా దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్న ఎలుకలు..ఎక్కడ స్టేషన్ లోని ఫైల్స్ ను కొరికేస్తాయేమోనన్న భయంతో పిల్లులను రంగంలోకి దించారు పోలీసులు.

ఇంకా చదవండి ...

Cats in police station : ఎలుకల(Rats) భయంతో పిల్లలను(Cats) పెంచుకుంటున్నారు పోలీసులు. పట్టుకుందామని ఎంత ప్రయత్నించినా దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్న ఎలుకలు..ఎక్కడ స్టేషన్ లోని ఫైల్స్ ను కొరికేస్తాయేమోనన్న భయంతో పిల్లులను రంగంలోకి దించారు పోలీసులు. కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కొద్ది రోజులుగా ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయి. బెంగళూరు నగరానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్‌ను 2014లో నిర్మించారు. ఈ స్టేషన్ లోకి తరచుగా వస్తున్న ఎలుకలు ఫైల్స్ కొరకడం ప్రారంభించాయి. అయితే ఎలుకల బెడద నుంచి తప్పించుకునేందుకు పోలీసులు చాలా ప్రయత్నాలే చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలుకలను పట్టుకోలేకపోయారు. దీంతో స్టేషన్ ఆవరణలో ఎలుకల బెడదను అరికట్టేందుకు రెండు పిల్లులను అక్కడ మొహరించారు పోలీసులు. ముఖ్యమైన ఫైళ్లను ఎలుకలు కొట్టడం ప్రారంభించాయని, అందువల్ల సమస్యను పరిష్కరించడానికి పిల్లులను ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసు స్టేషన్ వర్గాలు తెలిపాయి.


గౌరిబిదనూర్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ..."మాకు దగ్గరలో ఒక సరస్సు ఉంది. ఎలుకలు మా స్టేషన్‌ను నివాసానికి మంచి ప్రదేశంగా గుర్తించినట్లుంది. ఎలుకలు పోలీసు స్టేషన్ మొత్తం, ఫైళ్లను నిల్వ చేసిన సెల్‌లు మరియు గదుల్లోకి పరిగెత్తసాగాయి. అయితే చివరి ప్రయత్నంగా ఒక పిల్లిని మోహరించడంతో ఎలుకల బెడద తగ్గింది. ఇటీవల మరొక పిల్లిని తీసుకువచ్చాము. ఇప్పటివరకు అవి మూడు ఎలుకలను చంపాయి. రెండు పిల్లులకు పాలు మరియు ఆహారాన్ని అందిస్తున్నాము., అవి ఇప్పుడు పోలీసు స్టేషన్‌లో కుటుంబసభ్యుల్లా మారిపోయాయి"అని అన్నారు.

OMG : కలియుగ గాంధారి.. 40 ఏళ్లకే 44మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ..భయంతో భర్త పరార్

See Pics : సముద్రంపై కొత్త వంతెన..దేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి ఫొటోలు విడుదల

మరోవైపు, కర్నాటకలోని అనేక శాఖలు ఎలుకలు మరియు దోమల బెడదను అరికట్టడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తాయి. ఎలుకలు, దోమల బెడదను నివారించడానికి కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ (KEA) సంవత్సరానికి సుమారు రూ. 50,000 ఖర్చు చేస్తుందని సమాచార హక్కు (RTI) ప్రశ్నలో వెల్లడైంది. 2010-15 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఎలుకలను పట్టుకునేందుకు రూ.19.34 లక్షలు వెచ్చించినట్లు ప్రత్యేక ఆర్టీఐ విచారణలో తేలింది.

First published:

Tags: Cat, Karnataka, Police

ఉత్తమ కథలు