మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూత

news18-telugu
Updated: November 10, 2019, 11:21 PM IST
మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూత
టి.ఎన్.శేషన్(ఫేస్ బుక్ ఇమేజ్)
  • Share this:
మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎస్ శేషన్ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. టీఎన్ శేషన్ పూర్తి పేరు తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్. ఆయన 10వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేశారు. 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు ఆయన సీఈసీగా సేవలు అందించారు. 1955 బ్యాచ్‌కు ఐఏఎస్ అధికారి అయిన టీఎన్ శేషన్ తమిళనాడు కేడర్‌లో పనిచేశారు. అనంతరం 1989లో కేంద్ర కేబినెట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఆయన అందించిన సేవలకు గాను 1996లో రామన్ మెగసెసే అవార్డు కూడా అందుకున్నారు. టీఎన్ శేషన్ చనిపోయినట్టు మాజీ సీఈసీ డాక్టర్ ఎస్‌వై ఖురేషీ ధ్రువీకరించారు. ‘టీఎన్ శేషన్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయనో లెజెండ్. తన తర్వాత వారికి ఎలా ఉండాలో నేర్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.’ అని ఖురేషీ అన్నట్టు ఏఎన్‌ఐ వార్తాసంస్థ ట్వీట్ చేసింది.


టీఎన్ శేషన్ సొంత రాష్ట్రం కేరళ. పాలక్కడ్ జిల్లాలోని తిరునెల్లైలో 1932 డిసెంబర్ 15న జన్మించారు. ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో మూడేళ్లు పనిచేశారు. అక్కడున్నప్పుడే ఆయన ఐఏఎస్‌కు సెలక్ట్ అయ్యారు. టీఎన్ శేషన్ హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా చదువుకున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు.
First published: November 10, 2019, 11:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading