బెంగాల్ దీదీకి షాక్...బీజేపీలోకి మరో టీఎంసీ ఎమ్మెల్యే

2017లో నారదా కుంభకోణం కేసులో ఈడీ, సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న వారిలో సోబన్‌ ఛటర్జీ కూడా ఉన్నారు

news18-telugu
Updated: August 14, 2019, 10:26 PM IST
బెంగాల్ దీదీకి షాక్...బీజేపీలోకి మరో టీఎంసీ ఎమ్మెల్యే
బీజేపీలో చేరిన సోబన్ ఛటర్జీ
  • Share this:
వెస్ట్ బెంగాల్‌లో అధికార పార్టీ టీఎంసీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ గూటిలో చేరారు. కోల్‌కతా మాజీ మేయర్, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సోబన్ ఛటర్జీ బుధవారం కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ముకుల్ రాయ్‌తో పాటు ఇతర బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సోబన్ ఛటర్జీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి నిధులను సేకరించడంలో సోబన్‌ కీలక పాత్ర పోషించేవారు. ఆయన బీజేపీలో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఎంసీకి చెందిన పలువురు కీలక నేతలు ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. పార్టీని వీడొద్దని విజ్ఞప్తి చేశారు. కానీ సోబన్ టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. 2017లో నారదా కుంభకోణం కేసులో ఈడీ, సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న వారిలో సోబన్‌ ఛటర్జీ కూడా ఉన్నారు.

కాగా, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీ సాధించిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో బీజేపీలోకి వలసలు పెరిగాయి. ఆరుగురు టీఎంసీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌, సీపీఎం నుంచి ఒక్కో ఎమ్మెల్యే బీజేపీలో చేరిపోయారు.


లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ ఎమ్మెల్యేలంతా మమతా బెనర్జీని వదలివెళ్తారని ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ అన్నారు. సుమారు 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హుగ్లీలో బీజేపీ ఎన్నికల ప్రచార సభ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఎన్నికల తర్వాత 50 మందికి పైగా కౌన్సిలర్లు, ఆరుగురు ఎమ్మెల్యేలు టీఎంసీని వీడి బీజేపీ గూటికి చేరారు.

లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఊహించని విధంగా గతంతో పోల్చితే 16 సీట్లను కోల్పోయింది. 2014 ఎన్నికల్లో 34 ఎంపీ స్థానాలను టీఎంసీ కైవసం చేసుకోగా.. 2019లో 22 సీట్లకే పరిమితమైంది. కొన్నాళ్లుగా బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గతంలో 2 సీట్లకే పరిమితమైన కమలదళం ఈ ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలు గెలిచి మమతా బెనర్జీకి గట్టి షాకిచ్చింది.


First published: August 14, 2019, 10:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading