Home /News /national /

TMC LEADER MADAN MITRA SELLS CHAI ON THE ROAD AND ASK PEOPLE TO PAY RUPEES 15 LAKH FOR EACH CUP HERE IS THE REASON NK

Video: ఆ టీ కోసం ఎగబడిన జనం.. కప్పు రూ.15 లక్షలు!

Video: ఆ టీ కోసం ఎగబడిన జనం.. కప్పు రూ.15 లక్షలు (image credit - twitter)

Video: ఆ టీ కోసం ఎగబడిన జనం.. కప్పు రూ.15 లక్షలు (image credit - twitter)

Video: ఒక్క టీ రూ.15 లక్షలంటే నమ్మడం కష్టమే. కానీ అదే నిజమట. అంత రేటు పెట్టి ఆనందంగా కొనుక్కున్నారు. హాయిగా తాగారు. ఏముంది ఆ టీలో... ఎందుకు దానికి అంత రేటు?

    Video: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే మదన్ మిత్ర... ఆదివారం చాయ్ వాలా అవతారం ఎత్తారు. తన అభిమానులు, ప్రజలకు టీ ఇచ్చారు. దాని ధర రూ.15 లక్షలు అని చెప్పారు. అందరూ హాయిగా ఆ టీ తీసుకున్నారు. ఆనందంగా తాగారు. ఆ తర్వాత ఈ రాష్ట్ర రవాణా శాఖ మాజీ మంత్రి... కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సెటైర్స్ వేశారు. "మా తృణమూల్ కాంగ్రెస్సే కాదు... ఇతర విపక్షాలు కూడా... బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీ ఎప్పుడు అమలవుతుందా అని ఎదురుచూస్తున్నాం. ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామని నరేంద్ర మోదీ మాట ఇచ్చారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాం" అని మిత్ర సెటైర్ వేశారు.

    ఈ కమర్హాతీ ఎమ్మెల్యేకి ప్రజల్లో మంచి పాలోయింగ్, పాపులార్టీ ఉంది. "నేను కోల్‌కతాలోని ఈ భొవానీపూర్ ఏరియా ప్రజలకు ఉచితంగా టీ ఇస్తున్నాను. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా... ఆయన రైల్వే స్టేషన్లలో అమ్మిన టీ రుచికి దగ్గర్లోనే ఉంటుంది. నేను ఒక్కో టీ ధర రూ.15 లక్షలుగా చెబుతున్నాను. ప్రజలు ఆ డబ్బు చెల్లించాలి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దగ్గరగా ఉన్నవారు" అని ఆయన సెటైర్ వేశారు.


    ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మాజీ సహాయకుడిగా ఉన్న ఈ టీఎంసీ శాసన సభ్యుడు... ఇదివరకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయంటూ.. ఎడ్లబండిపై ప్రచారం చేశారు.

    ఇది కూడా చదవండి: Rape Case: బాలికపై ఆరుగురు అత్యాచారం.. వేర్వేరు ఘటనల్లో...

    చిత్రమేంటంటే... ఈ టీ సెటైర్‌ని బీజేపీ నేత దిలీప్ ఘోష్... పాజిటివ్‌గా తీసుకున్నారు. ప్రజల్లో మీకు ఉన్న పాపులార్టీని బాగానే వాడేసుకుటున్నారని సరదాగా కాంప్లిమెంట్ ఇచ్చారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: VIRAL NEWS, Viral Video, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు