టైమ్.. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మ్యాగజైన్ ఇది. దీనిలో కథనాలు వచ్చాయంటే కచ్చితత్వంతో, నిజాయితీగా ఉంటాయని అనుకుంటారు. కానీ, ఈ మధ్య వచ్చిన రెండు కథనాలు ఈ మ్యాగజైన్ విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని ‘భారత ప్రధాన విభజనదారు’ అని పేర్కొన్న ఆ మ్యాగజైనే ఎన్నికల తర్వాత మోదీ విభజనవాది కాదు.. సమైక్యవాది అని పేర్కొంది. ‘ఏ ప్రధాని చేయనంతగా దేశాన్ని ఏకం చేసిన మోదీ’(మోదీ యునైటెడ్ ఇండియా లైక్ నో పీఎం ఇన్ డికేడ్) శీర్షికతో ఐడియాస్ విభాగంలో తాజాగా మరో కథనాన్ని ప్రచురించింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించిన నేపథ్యంలో మోదీని కీర్తిస్తూ టైమ్స్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మనోజ్ లాద్వా ఈ కథనం రాశారు. ‘గత ఐదేళ్లలో మోదీ తీసుకున్న నిర్ణయాలు, విధానాల కారణంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ.. భారతీయ ఓటర్లను ఆయన ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. గత ఏదు దశాబ్దాల్లో ఏ ప్రధాని ఈ పని చేయలేకపోయారు’ అని ఆయన తన కథనంలో పేర్కొన్నారు. 2014లో మోదీ క్యాంపెయిన్‌లో రీసెర్చ్ అనాలసిస్ అండ్ మెసేజింగ్ డివిజన్‌లో మనోజ్ లాద్వా పనిచేశారు.
ఇదిలా ఉండగా, టైమ్ మ్యాగజైన్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని, వివక్ష పూరిత వ్యాఖ్యలతో కథనాలు రాస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు మోదీని తిట్టిపోసిన ఆ మ్యాగజైన్.. ఇప్పుడు మోదీని పొడుగుతూ ఆర్టికల్ రాయడం వివక్షపూరితమేనని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Election Commission of India, India news, Lok Sabha Elections 2019, Narendra modi, Pm modi, Results