• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • TIKTOK STAR POOJA CHAVAN SUICIDE CASE CREATS POLITICAL STORM IN MAHARASTRA SSR

TikTok Star Pooja Chavan Suicide: మహారాష్ట్రలో ప్రకంపనలు రేపుతున్న టిక్‌టాక్ స్టార్ మృతి.. ఆయనతో లింకులున్నాయంటూ..

TikTok Star Pooja Chavan Suicide: మహారాష్ట్రలో ప్రకంపనలు రేపుతున్న టిక్‌టాక్ స్టార్ మృతి.. ఆయనతో లింకులున్నాయంటూ..

పూజా చవాన్

మహారాష్ట్రలో 22 ఏళ్ల టిక్‌టాక్ స్టార్ పూజా చవాన్ ఆత్మహత్య రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. పుణెలోని వనవాడి ప్రాంతంలో ఉన్న హెవెన్ పార్క్ బిల్డింగ్ పై నుంచి దూకి ఫిబ్రవరి 8న పూజా ఆత్మహత్యకు పాల్పడింది. వనవాడి పోలీసులు అనుమానాస్పద మృతిగా...

  • Share this:
    ముంబై: మహారాష్ట్రలో 22 ఏళ్ల టిక్‌టాక్ స్టార్ పూజా చవాన్ ఆత్మహత్య రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. పుణెలోని వనవాడి ప్రాంతంలో ఉన్న హెవెన్ పార్క్ బిల్డింగ్ పై నుంచి దూకి ఫిబ్రవరి 8న పూజా ఆత్మహత్యకు పాల్పడింది. వనవాడి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూజా చవాన్ కేసులో మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ పేరు తెరపైకి రావడంతో ఆయనను అరెస్ట్ చేయాలని మహారాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది. పూజా చవాన్ చనిపోయిన కొన్ని రోజులకు సోషల్ మీడియాలో ఆమె పేరుతో కొన్ని ఆడియో క్లిప్స్ వైరల్‌గా మారాయి. ఆ ఆడియో క్లిప్స్‌లో పూజా చవాన్‌తో రాథోడ్‌కు సంబంధాలున్నట్లు స్పష్టమైందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ డీజీపీ హేమంత్‌కు లేఖ రాశారు.

    పూజా, రాథోడ్ మధ్య బయటికొచ్చిన 14 ఆడియో క్లిప్స్‌ను కూడా ఆయన సమర్పించారు. శివసేన మంత్రి రాథోడ్‌ వల్లే పూజా చవాన్‌ ఆత్మహత్యకు పాల్పడిందని.. మంత్రిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేత చిత్ర వాఘ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. పూచా చవాన్ తల్లిదండ్రులు మాత్రం తమకు ఎవరి పైనా అనుమానాలు లేవని చెప్పారు. పూజా చవాన్ తండ్రి లహు చవాన్ మాట్లాడుతూ.. తమ కుటుంబం అప్పుల్లో ఉందని.. ఆ బాకీల గురించి తమ కుమార్తె బాధపడుతుండేదని చెప్పారు. ఆత్మహత్యకు తమ కుటుంబ పరిస్థితులే దారి తీసి ఉండొచ్చని తెలిపారు.

    ఇప్పటికే తమ కూతురిని కోల్పోయామని, ఆమె మళ్లీ తిరిగి రాదని.. ఆమె ఆత్మహత్య విషయంలో ఎవరిపైనా తమకు అనుమానం లేదని పూజా తండ్రి స్పష్టం చేశారు. సమాజంలో తమను, తమ కూతురిని అప్రతిష్టపాలు చేయడం దయచేసి ఆపాలని చవాన్ కోరారు. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఆ ఆడియో క్లిప్స్ తమ కూతురివి కాదని ఆయన తెలిపారు. తాము ఎవరినీ తప్పుబట్టడం లేదని, దయచేసి తమ కుటుంబాన్ని మరింత బాధకు గురిచేయొద్దని, తమ కుమార్తెపై ఇకనైనా ఆరోపణలు మానుకోవాలని సూచించారు.
    Published by:Sambasiva Reddy
    First published: